Share News

Telangana Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులు

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:32 AM

తెలంగాణలో మున్నిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులను నియమిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

Telangana Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులు
Telangana Municipal Elections

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణలో త్వరలో జరగబోయే మున్నిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులను నియమిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ వారీగా ఆయా మంత్రులకు ఇన్‌ఛార్జ్‌‌ బాధ్యతలు అప్పగించింది. 15 నియోజకవర్గాలకు గానూ 15 మంది మంత్రులు ఇన్‌ఛార్జ్‌లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు(Telangana Municipal Elections) జరగనున్నాయి. సంబంధిత రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం.


మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌‌లుగా మంత్రులు:

  • ఆదిలాబాద్ - ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

  • మల్కాజిగిరి - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • చేవెళ్ల - దుద్దిళ్ల శ్రీధర్ బాబు

  • కరీంనగర్ - తుమ్మల నాగేశ్వరరావు

  • ఖమ్మం - కొండా సురేఖ

  • మహబూబాబాద్ - పొన్నం ప్రభాకర్

  • మహబూబ్‌నగర్ - దామోదర రాజనరసింహ

  • జహీరాబాద్ - అజారుద్దీన్

  • మెదక్ - వివేక్ వెంకటస్వామి

  • నాగర్‌కర్నూల్ - వాకిటి శ్రీహరి

  • నల్గొండ - అడ్లూరి లక్ష్మణ్ కుమార్

  • భువనగిరి - సీతక్క

  • నిజామాబాద్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • వరంగల్ - పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  • పెద్దపల్లి - జూపల్లి కృష్ణారావు


ఇవీ చదవండి:

శ్రీపంచమి వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జస్ట్ చిన్న కండిషన్

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 12:22 PM