Share News

Food Poisoning: ప్రీ-వెడ్డింగ్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 125 మందికి అస్వస్థత

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:51 PM

పెళ్లి నిశ్చితార్థ కార్యక్రమంలో వడ్డించిన ఆహారం తిని దాదాపు 125 మంది అస్వస్థతకు గురయ్యారు. విందు ఆరగించిన వారికి ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి, వికారం రావడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Food Poisoning:  ప్రీ-వెడ్డింగ్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 125 మందికి అస్వస్థత
Pre Wedding Event Food Poisoning

ఆంధ్రజ్యోతి, జనవరి 19: మహారాష్ట్రలోని థానే జిల్లా కల్యాణ్ ప్రాంతంలో జరిగిన ప్రీ-వెడ్డింగ్(హల్దీ) కార్యక్రమం విషాదంగా మారింది. విందులో వడ్డించిన ఆహారం తిన్న తర్వాత సుమారు 125 మందికి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించాయి. వారందరికీ ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి, వికారం రావడంతో వేడుకలో కలకలం రేగింది.


బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. చికిత్స అనంతరం చాలామంది పరిస్థితి నిలకడగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


కార్యక్రమానికి ఆహార పదార్థాలు సరఫరా చేసిన క్యాటరింగ్ సర్వీస్ నిర్వాహకులను విచారిస్తున్నట్లు సమాచారం. ఆహార నమూనాలను ల్యాబ్‌కు పంపించి ఫుడ్ పాయిజనింగ్‌కు గల కారణాలను నిర్ధారించే ప్రయత్నాలు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..

మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..

For More Devotional News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 01:23 PM