Prateek Yadav: యూపీ మాజీ సీఎం ములాయంసింగ్ కుమారుడు సంచలన పోస్ట్
ABN , Publish Date - Jan 19 , 2026 | 07:26 PM
యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్.. తన భార్య అపర్ణా యాదవ్ పై సంచలన కామెంట్స్ చేశాడు. అపర్ణ తన కుటుంబాన్ని నాశనం చేసిందని ఆరోపిస్తూ, ఆమెకు విడాకులు ఇవ్వనున్నట్లు ఇన్ స్టా వేదికగా సోమవారం ప్రకటించాడు.
యూపీ, జనవరి18: సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్(Prateek Yadav) తన భార్య, బీజేపీ నాయకురాలు అపర్ణా యాదవ్ సంచలన కామెంట్స్ చేశాడు. అపర్ణ తన కుటుంబాన్ని నాశనం చేసిందని ఆరోపిస్తూ, ఆమెకు విడాకులు ఇవ్వనున్నట్లు ఇన్ స్టా వేదికగా సోమవారం ప్రకటించాడు.
ప్రతీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో అపర్ణ(Aparna Yadav) ఫొటోను షేర్ చేస్తూ పలు అంశాలను పోస్టు చేశాడు. 'మా కుటుంబాన్ని అపర్ణ నాశనం చేసేది. ఆమె స్వార్థపరురాలు. ఆమె కారణంగా నేను తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నాను. నేను అపర్ణకువీలైనంత త్వరగా విడాకులు ఇవ్వబోతున్నాను. ఆమెకు కావలసిందల్లా కేవలం పేరు ప్రఖ్యాతులు. పలుకుబడి మాత్రమే. ఆమె నా పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆమె తన గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఇంత చెడ్డ వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు నేను దురదృష్టవంతుడిని' అంటూ ప్రతీక్ పోస్ట్ చేశాడు.
ఈ పోస్ట్ పై అపర్ణ సోదరుడు అమన్ బిష్ట్ స్పందించాడు. ప్రతీక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాకైందని తెలిపాడు. ప్రతీక్, అపర్ణల వివాహం 2011లో జరిగింది. వారికి ఒక కుమార్తె ఉంది. పెళ్లైన కొత్తలో సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న అపర్ణ, 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. అయితే బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓటమి పాలైంది. వివిధ కారణాలతో ఆమె 2022లో భారతీయ జనతా పార్టీలో చేరింది. ఆమె ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తోంది.
ఇవీ చదవండి:
Nitin Nabeen: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్
Unnao Case: ఉన్నావ్ అత్యాచార కేసులో హైకోర్టు కీలక తీర్పు