Nitin Nabeen: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:48 PM
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎంపికయ్యారు. మంగళవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అత్యంత పిన్న వయస్కుడైన నితిన్.. పార్టీ పగ్గాలు చేపట్టడం గమన్హారం.
ఢిల్లీ, జనవరి19: భారతీయ జనతా పార్టీ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. పార్టీ అధ్యక్షుడిగా అత్యంత పిన్న వయస్కుడైన నేత నితిన్ నబీన్ ఎంపికైన సంగతి తెలిసిందే. నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో నితిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ నేతలు పరిశీలిస్తున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ ఎంపిక చేయడంతో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు ప్రధాని మోదీ మంత్రివర్గంలోనూ భారీ మార్పులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. 55ఏళ్ల లోపు వయసున్న నేతలకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం.. నితిన్ నబీన్ బిహార్ రాష్ట్ర బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
ఇవీ చదవండి:
అర్ధరాత్రి మహిళకు షాకింగ్ అనుభవం! ఛాతిపై ఏదో ఉన్నట్టు అనిపించి చూస్తే..
Unnao Case: ఉన్నావ్ అత్యాచార కేసులో హైకోర్టు కీలక తీర్పు