Share News

Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:01 PM

కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, ఎఫ్‌ఎమ్‌సీజీ సెక్టార్ ఆకర్షణీయంగా మారడం, ఈయూ-భారత్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో కదలిక కారణంగా సూచీలు భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. అయినప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతోనే రోజును ముగించాయి.

Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
Stock Market

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాల కారణంగా భారీ నష్టాల్లో కదలాడిన దేశీయ సూచీలు చివర్లో కాస్తంత కోలుకున్నాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, ఎఫ్‌ఎమ్‌సీజీ సెక్టార్ ఆకర్షణీయంగా మారడం, ఈయూ-భారత్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో కదలిక కారణంగా సూచీలు భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. అయినప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతోనే రోజును ముగించాయి. (Indian stock market).


గత సెషన్ ముగింపు (83, 570)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ వెంటనే భారీ నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 670 పాయింట్లకు పైగా కోల్పోయి 82, 898 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పడిపోయింది. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో భారీ నష్టాల నుంచి కోలుకుంది. చివరకు సెన్సెక్స్ 324 పాయింట్ల నష్టంతో 83, 246 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 108 పాయింట్ల నష్టంతో 25, 585 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌లో సీజీ పవర్, హిటాచీ ఎనర్జీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, పాలీక్యాబ్, హిందుస్థాన్ జింక్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). విప్రో, ఆర్బీఎల్ బ్యాంక్, గోద్రేజ్ ప్రాపర్టీస్, పీఎన్‌బీ, కల్యాణ్ జువెల్లర్స్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 203 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 220 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.91గా ఉంది.


ఇవి కూడా చదవండి..

ల్యాండింగ్ సమయంలో ఊడిన విమానం టైరు.. షాకింగ్ వీడియో వైరల్..


మీ ఐక్యూకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న కుక్కను 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 19 , 2026 | 04:01 PM