Share News

Guntur Court: ప్రేమ పేరుతో మోసం.. ఆ పోలీస్ ఆఫీసర్‌కు పదేళ్ల శిక్ష

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:35 PM

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి, లైంగికంగా దాడి చేసిన ఘటనలో ఎస్ఐ రవితేజకు గుంటూరు జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్షను విధించింది.

Guntur Court: ప్రేమ పేరుతో మోసం.. ఆ పోలీస్ ఆఫీసర్‌కు పదేళ్ల శిక్ష
Guntur Court

గుంటూరు జిల్లా, జనవరి 19: ప్రేమ పేరుతో మోసానికి పాల్పడిన ఓ ఎస్‌ఐ కేసులో జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. యువతిని ప్రేమించానంటూ నమ్మించి మోసం చేసిన ఎస్‌ఐ రవితేజకు న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. గుంటూరు జిల్లాలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రవితేజ ఓ యువతిని ప్రేమించినట్టు నటించి మోసం చేశాడు. ఆమెను లైంగికంగా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారించిన 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిందితుడైన ఎస్ఐకి పదేళ్ల శిక్ష విధించింది. ప్రస్తుతం.. రవితేజ అమృతలూరు పీఎస్‌లో ఎస్ఐగా ఉన్నారు. జిల్లా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు సంచలనంగా మారింది.


ఇదీ ఘటన..

2023లో ఎస్‌ఐ రవితేజపై ఓ యువతి నగరపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను రవితేజ ప్రేమించాడని, పెళ్లి చేసుకోమంటే నిరాకరించి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఏడాదిన్నరగా రవితేజతో పరిచయం ఉందని, పలుమార్లు అతడి అపార్ట్‌మెంట్‌కు కూడా తీసుకెళ్లినట్లు ఆమె చెప్పింది. దీంతో పోలీసులు ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు అత్యాచార కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆ ఎస్‌ఐ విధులకు రాకపోవడంతో ఉన్నతాధికారులు ఈ అంశాన్ని సీరియస్‌‌గా తీసుకుని.. అతణ్ని సస్పెండ్ చేశారు.

యువతి ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఎస్‌ఐ, అతని కుటుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడినట్లు యువతి వాపోయింది. అయితే.. ఈ వ్యవహారంపై స్పందించిన ఎస్‌ఐ.. తాను ఎవరినీ మోసం చేయలేదని, యువతితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.


ఇక.. ఈ వ్యవహారంపై గుంటూరు కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. చిరవగా.. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడని నిర్ధారణకు వచ్చిన న్యాయస్థానం.. ఎస్‌ఐ రవితేజకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.


ఇవి కూడా చదవండి...

రాజకీయ యాత్ర కాదు.. దేవుడి మొక్కు మాత్రమే: బండ్ల గణేష్

వేమన నీతి సూత్రాలు సమాజానికి అనుసరణీయం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 05:52 PM