Share News

Minister Farooq: వారి పాలనంతా దోపిడే.. వైసీపీపై మంత్రి ఫరూక్ ఫైర్

ABN , Publish Date - Jan 19 , 2026 | 07:31 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జగన్ రెడ్డి చేపట్టిన దుశ్చర్యలు, అక్రమాల వల్ల నేటికి పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Minister Farooq:  వారి పాలనంతా దోపిడే.. వైసీపీపై మంత్రి ఫరూక్ ఫైర్
AP Minister NMD Farooq

అమరావతి, జనవరి19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ (AP Minister NMD Farooq) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అమరావతి వేదికగా మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జగన్ రెడ్డి చేపట్టిన దుశ్చర్యలు, అక్రమాల వల్ల పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జగన్ హయాంలో అంతా కూడా దోపిడీ చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శలు చేశారు. సమస్య అంటూ తెలుగుదేశం పార్టీ గుమ్మం తొక్కిన వాటిల్లో 90 శాతం పిటిషన్లు జగన్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తున్నాయని వెల్లడించారు. జగన్ రెడ్డి దానికి కూడా క్రెడిట్ కావాలంటాడేమో మరి అని ఎద్దేవా చేశారు. ఆయన ఫొటోలు పెట్టుకుంటే అది క్రెడిట్ ఎలా అవుతుందని సెటైర్లు గుప్పించారు. వైసీపీ పాలనలో ఒక్కటి కూడా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శలు చేశారు.


దుష్ప్రచారం చేస్తున్నారు..

కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టిన దానికి జగన్ రెడ్డిదే క్రెడిట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్ పోర్టును వ్యతిరేకించిన జగన్ రెడ్డి.. ఇటీవల ట్రైయిల్ రన్ నేపథ్యంలో క్రెడిట్ నాదే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. అధికారంలోకి రావడంతోనే ప్రజావేదికను కూల్చివేశారని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి హంద్రీనీవా నదికి చేసిందేంటి..? అని మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు. ఏమి చేసినందుకు జగన్ రెడ్డి క్రెడిట్ ఇవ్వాలో చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రజల తరపున పోరాటాలు చేసినందుకు టీడీపీ నాయకుల మీద జగన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించారని ఫైర్ అయ్యారు. దానికి సంబంధించిన క్రెడిట్ మాత్రం జగన్ రెడ్డికే ఇవ్వాలని ఎద్దేవా చేశారు.


గంటల తరబడి ప్రెస్‌‌మీట్లు..

వారానికి ఒకసారి తాడేపల్లి ఫ్యాలెస్‌కి వస్తారని.. తన అనుకూల మీడియా ముందు నాలుగు గోడల మధ్య ఏదో గంటల తరబడి ప్రెస్ మీట్లు పెడతారని సెటైర్లు గుప్పించారు. మీడియా సమావేశం కాగానే వెంటనే బెంగళూరు వెళ్లిపోతారని.. అందుకే జగన్ రెడ్డిని కేర్రాఫ్ బెంగళూరు అనేదని దెప్పిపొడిచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిని కనీసం 33 వేల ఎకరాల్లో నిర్మించాలని అనలేదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చేసరికి అదే అమరావతిపై ఇష్టానుసారంగా మాట్లాడి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారని దుయ్యట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ

Tirupati Incident: తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 07:57 PM