Monkey rescues baby: బిడ్డ కంటే ప్రాణం ఎక్కువ కాదు.. ఓ కోతి చేసిన సాహసం చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:46 PM
ఈ సృష్టిలో అన్నింటి కంటే గొప్పది తల్లి ప్రేమ. బిడ్డ కోసం తల్లి ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. బిడ్డ ప్రమాదంలో ఉందంటే తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతుంది. తల్లి ప్రేమ విషయంలో మనుషులు, జంతువులు అనే తేడా లేదు.
ఈ సృష్టిలో అన్నింటి కంటే గొప్పది తల్లి ప్రేమ. బిడ్డ కోసం తల్లి ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. బిడ్డ ప్రమాదంలో ఉందంటే తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతుంది. తల్లి ప్రేమ విషయంలో మనుషులు, జంతువులు అనే తేడా లేదు. తాజాగా ఓ కోతి తన బిడ్డను రక్షించుకోవడం కోసం ప్రాణాంతక సాహసం చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (monkey saves child video).
@Thebestfigen అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక పిల్ల కోతి కరెంట్ తీగలపై ఇరుక్కుపోయి ఉన్నట్లు కనిపిస్తోంది. అక్కడి నుంచి బయటపడడం ఎలాగో ఆ కోతికి తెలియలేదు. ఆ పిల్ల కోతి తల్లి సమీపంలో ఉన్న భవనం గోడ మీద కూర్చుని ఉంది. బిడ్డను రక్షించుకునే మార్గాల కోసం రకరకాల ప్లాన్లు వేసింది. చివరకు ఆ తల్లి కోతి కరెంట్ తీగల మీదకు దూకి బిడ్డను పట్టుకుని తిరిగి భవనం మీదకు సురక్షితంగా వచ్చేసింది (amazing animal rescue).
బిడ్డ కోసం తల్లి కోతి చేసిన సాహసం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది (viral monkey video). ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.8 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 11 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. తల్లి ప్రేమను మించిన రక్షణ ఎక్కడా ఉండదని చాలా మంది కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
ల్యాండింగ్ సమయంలో ఊడిన విమానం టైరు.. షాకింగ్ వీడియో వైరల్..
మీ ఐక్యూకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న కుక్కను 5 సెకెన్లలో కనిపెట్టండి..