Share News

Viral Video: బస్సులో అసభ్యంగా తాకాడంటూ పోస్ట్ చేసిన యువతి, వీడియో వైరల్.. వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Jan 19 , 2026 | 02:12 PM

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ సదరు ఘటనను సెల్ ఫోన్లో చిత్రీకరించిన ఒక యువతి.. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో అవమానం భరించలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

Viral Video: బస్సులో అసభ్యంగా తాకాడంటూ పోస్ట్ చేసిన యువతి, వీడియో  వైరల్.. వ్యక్తి ఆత్మహత్య
Kerala, a man allegedly died by suicide

ఆంధ్రజ్యోతి, జనవరి 19: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌ జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన దీపక్(42) అనే వ్యక్తి శుక్రవారం (జనవరి 16న) ఆర్టీసీ బస్సులో ప్రయాణించాడు. అదే బస్సులో అతని వెనుక ఒక యువతి కూడా ప్రయాణిస్తోంది. అయితే, ముందున్న వ్యక్తి కావాలనే తనను తాకుతున్నాడని భావించిన సదరు యువతి ఆ దృశ్యాల్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.


మహిళను అసభ్యంగా తాకాడంటూ సదరు వీడియో వైరల్ కావడంతో.. అది చూసిన దీపక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతనికి ధైర్యం చెప్పినప్పటికీ పరువు పోయిందని భావించిన దీపక్.. తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.


ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో దీపక్‌ను నిద్రలేపేందుకు ప్రయత్నించగా.. ఎంతసేపటికీ డోర్ తీయలేదు. దీంతో బలంగా డోర్‌ను బద్దలుగొట్టి లోపలికి వెళ్లి చూస్తే.. దీపక్ విగతజీవిగా కనిపించాడు. దీంతో సదరు యువతి పెట్టిన వీడియో కారణంగానే దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ఈ వీడియో మీద సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..

మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..

For More Devotional News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 02:49 PM