Gold, Silver Rates Jan 19: పసిడి, వెండి ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jan 19 , 2026 | 06:40 AM
ఈ వారం బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పసిడి, వెండికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. గతవారం భారీగా పెరిగిన ధరలు, ఈ వారం కూడా మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం (జనవరి 19) ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధరల 1,43,770గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,31,790 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం కూడా ఇవే ధరలు ఉన్నాయి (Gold, Silver Prices on Jan 19).
ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ప్రస్తుతం రూ.3,09,900గా ఉంది. విజయవాడ, వైజాగ్‌లో కూడా దాదాపు ఇదే ధర కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీలో కిలో వెండి అత్యల్పంగా రూ.2,94,900 వద్ద ట్రేడవుతోంది. ఇక ఈ వారం బంగారం ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, వెండి ధరలు మాత్రం దిద్దుబాటుకు లోనుకావచ్చని భావిస్తున్నాయి. ఈ దిద్దుబాటు స్వల్పకాలికమేనని కూడా చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరింత పెరగకతప్పదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వివిధ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు (24కే, 22కే)
చెన్నై: ₹1,44,860; ₹1,32,790;
ముంబై: ₹1,43,770; ₹1,31,790;
న్యూఢిల్లీ: ₹1,43,920; ₹1,31,940;
కోల్‌కతా: ₹1,43,770; ₹1,31,790;
బెంగళూరు: ₹1,43,770; ₹1,31,790;
హైదరాబాద్: ₹1,43,770; ₹1,31,790;
విజయవాడ: ₹1,43,770; ₹1,31,790;
కేరళ: ₹1,43,770; ₹1,31,790;
పుణె: ₹1,43,770; ₹1,31,790;
వడోదరా: ₹1,43,820; ₹1,31,840;
అహ్మదాబాద్: ₹1,43,820; ₹1,31,840;
వెండి (కిలో) ధరలు ఇవీ
చెన్నై: ₹3,09,900
ముంబై: ₹2,94,900
న్యూఢిల్లీ: ₹2,94,900
కోల్‌కతా: ₹2,94,900
బెంగళూరు: ₹2,94,900
హైదరాబాద్: ₹3,09,900
విజయవాడ: ₹3,09,900
కేరళ: ₹3,09,900
పుణె: ₹2,94,900
వడోదరా: ₹2,94,900
అహ్మదాబాద్: ₹2,94,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
భారతీయ ఫార్మా ఎగుమతుల జోష్.. ఏకంగా రూ.1.84 లక్షల కోట్లు
షేర్ల లాభాలపై ఎల్‌టీసీజీ తగ్గించాలి.. ఆర్థిక మంత్రి మార్కెట్ వర్గాల విజ్ఞప్తి