FPI Outflows India: రూ.22,530 కోట్ల ‘ఎఫ్‌పీఐ’ పెట్టుబడులు అవుట్
ABN , Publish Date - Jan 19 , 2026 | 02:28 AM
కొత్త ఏడాదిలోనూ విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాలు ఆగడం లేదు. ఈ నెల 1-16 తేదీల మధ్య ఈ ఎఫ్‌పీఐలు దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి....
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలోనూ విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాలు ఆగడం లేదు. ఈ నెల 1-16 తేదీల మధ్య ఈ ఎఫ్‌పీఐలు దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి రూ.22,530 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయు. అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలపై వడ్డీ రేట్లు పెరగడం, ప్రధాన కరెన్సీలతో డాలర్ మారకం రేటు పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, భారత-అమెరికా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి, డాలర్‌తో రూపాయి మారకం రేటు మరింత తగ్గటం ఇందుకు మరింత దోహదం చేస్తోంది. గత ఏడాది మొత్తం మీద కూడా ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి. స్పష్టమైన సానుకూల సంకేతాలు అందే వరకు ఎఫ్‌పీఐల అమ్మకాలకు బ్రేక్ పడే అవకాశం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..
మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..
For More Devotional News And Telugu News