Capital Market Seeks LTCG Tax Cut Demand: షేర్ల లాభాలపై ఎల్‌టీసీజీ తగ్గించాలి
ABN , Publish Date - Jan 19 , 2026 | 02:47 AM
వచ్చే కేంద్ర బడ్జెట్‌లో తమ విన్నపాలను పట్టించుకోవాలని క్యాపిటల్ మార్కెట్ వర్గాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరాయి. రిటైల్ మదుపరులు, దీర్ఘకాలిక....
రూ.2 లక్షల వరకు పన్ను వద్దు
బడ్జెట్‌పై క్యాపిటల్ మార్కెట్ ఆశలు
న్యూఢిల్లీ: వచ్చే కేంద్ర బడ్జెట్‌లో తమ విన్నపాలను పట్టించుకోవాలని క్యాపిటల్ మార్కెట్ వర్గాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరాయి. రిటైల్ మదుపరులు, దీర్ఘకాలిక మదుపరులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రస్తుతం 12.5 శాతంగా ఉన్న దీర్ఘకాలిక మూలధన లాఽభాల పన్ను (ఎల్‌టీసీజీటీ)ని, 20 శాతంగా ఉన్న స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను (ఎస్‌టీసీజీటీ)ని 10 శాతానికి కుదించాలని కోరింది. అలాగే ప్రస్తుతం ఏటా రూ.1.25 లక్షల వరకు ఉన్న ఎల్‌టీసీజీటీ మినహాయింపు పరిమితిని రూ.2 లక్షలకు పెంచాలని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచించింది.
ఇతర ముఖ్య కోరికలు
షేర్ల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) మరింత పెంచొద్దు
బంగారం, వెండిపై మరింత పన్నుల భారం వద్దు
ఈక్విటీ, రియల్టీ, డెట్, పసిడి దీర్ఘకాలిక లాభాలకూ 12 నెలల కాల పరిమితి వర్తింప చేయాలి
ఒక ఆస్తి లావాదేవీలపై వచ్చే నష్టాలను, మిగతా ఏ ఆస్తి అమ్మ కాల లాభాల నుంచైనా భర్తీ చేసుకునే సదుపాయం కల్పించాలి
నగదు ఈక్విటీ లావాదేవీలపై ఎస్‌టీటీ డెరివేటివ్స్‌పై కంటే తక్కువగా ఉండాలి
షేర్ల బైబ్యాక్‌పై వచ్చే లాభాలపై మాత్రమే పన్ను పోటు ఉండాలి
ఈ వార్తలు కూడా చదవండి..
మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..
మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..
For More Devotional News And Telugu News