Stock Market Volatility Ahead: ఆటుపోట్లకు అవకాశం..
ABN , Publish Date - Jan 19 , 2026 | 02:42 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశం ఉంది. వేగంగా మారుతున్న అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ....
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశం ఉంది. వేగంగా మారుతున్న అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందన్న సంకేతాలతో మార్కెట్లలో ఆందోళన నెలకొంది. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడులు పెట్టడం మంచిది. ఆర్థిక ఫలితాల సీజన్ మొదలవటం సూచీల దశదిశను సూచించే వీలుంది. ప్రస్తుతం మెటల్స్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, కమోడిటీస్, ఆటో, బ్యాంకింగ్ రంగాల్లో మూమెంటమ్ కనిపిస్తోంది.
స్టాక్ రికమండేషన్స్
టెక్ మహీంద్రా: స్వల్ప పుల్‌బ్యాక్ తర్వాత ఈ కౌంటర్ మంచి మూమెంటమ్‌ను చూపిస్తోంది. సమీప నిరోధాన్ని అధిగమించేందుకు సిద్ధమైంది. పైగా నిఫ్టీతో పోల్చితే జోరు ప్రదర్శిస్తోంది. ఫలితాల అనంతరం గత శుక్రవారం 5.6 శాతం లాభంతో రూ.1,670 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.1,650 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,800 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,630 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్: నష్టాల మార్కెట్లోనూ ఈ షేరు మంచి రాబడి అందిస్తోంది. గత ఏడాది మార్చి నుంచి 45 శాతం మేర రాణించింది. రిలేటివ్ స్ట్రెంత్, వాల్యూమ్ పెరగటంతో ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. గత శుక్రవారం రూ.132 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.130 శ్రేణిలో ప్రవేశించి రూ.155 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.125 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
బీపీసీఎల్: గత ఏడాది మార్చి నుంచి ఈ షేరు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. ఇన్వెస్టర్లకు 60 శాతం మేర రాబడులు అందించింది. ఆర్థిక ఫలితాలు త్వరలో ప్రకటించనుండటంతో మరింత పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.363 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.360 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.410 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.352 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీల్ (జేఎ్‌సఎల్): ప్రస్తుతం ఈ కౌంటర్ జీవితకాల గరిష్ఠ స్థాయిలో కదలాడుతోంది. మూమెంటమ్ దొరికితే నిరోధాన్ని అధిగమించి మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ వారంలో వెలువడే ఆర్థిక ఫలితాలపై ఇది ఆధారపడి ఉంటుంది. గత శుక్రవారం రూ.813 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.800 ఎగువన ప్రవేశించి రూ.910 టార్గెట్ ధర తో కొనుగోలు చేయవచ్చు.అయితే రూ.785 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
హింద్ పెట్రో: జీవితకాల గరిష్ఠ స్థాయిలో కదలాడుతున్న ఈ షేరు దీర్ఘకాలిక అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఏకంగా 75 శాతం రాబడిని అందించింది. రిలేటివ్ స్ట్రెంత్ మెరుగవుతోంది. గత శుక్రవారం రూ.457 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.450 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.520/570 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.440 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
- మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..
మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..
For More Devotional News And Telugu News