Nifty Technical View: టెక్ వ్యూ నిరోధ స్థాయి 26,000
ABN , Publish Date - Jan 19 , 2026 | 02:39 AM
గత వారం నిఫ్టీ కీలక స్థాయి 24,500 నుంచి బలమైన పునరుజ్జీవం సాధించినప్పటికీ చివరి మూడు రోజుల్లో 25,900-25,600 పాయింట్ల మధ్యన పరిమిత పరిధిలోనే కదలాడింది. చివరికి...
గత వారం నిఫ్టీ కీలక స్థాయి 24,500 నుంచి బలమైన పునరుజ్జీవం సాధించినప్పటికీ చివరి మూడు రోజుల్లో 25,900-25,600 పాయింట్ల మధ్యన పరిమిత పరిధిలోనే కదలాడింది. చివరికి చెప్పుకోదగినంత కదలికలేవీ లేకుండా 11 పాయింట్ల నామమాత్రపు లాభంతో 25,700 సమీపంలో ముగిసింది. ముందు వారంలో ఏర్పడిన 650 పాయింట్ల బ్రేక్‌డౌన్ అనంతరం ఏర్పడిన పుల్‌బ్యాక్ ఇది. ఇప్పుడు సూచీ మరింత రికవరీలో పయనించే ఆస్కారం ఉంది.
స్వల్పకాలిక అప్‌ట్రెండ్ సాధించాలంటే మాత్రం మార్కెట్ బలాన్ని ప్రదర్శించక తప్పదు. గత వారం అనిశ్చితంగా ముగిసినప్పటికీ ఈ వారంలో ఎగువకు మొగ్గుతో కన్సాలిడేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
బుల్లిష్ స్థాయిలు: పాజిటివ్ ట్రెండ్‌లో ట్రేడయినట్టయితే మరింత అప్‌ట్రెండ్ కోసం నిరోధ స్థాయి 25,850 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం, మానసిక అవధి 26,000. స్వల్పకాలిక సానుకూల ధోరణి కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి.
బేరిష్ స్థాయిలు: బలహీనత ప్రదర్శించినట్టయితే దిగువన 25,600 వద్ద గట్టి మద్దతు లభిస్తోంది. ఇక్కడ విఫలమైతే మరింత బలహీనపడే ఆస్కారం ఉంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 25,450. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక అప్రమత్తత మరింతగా కొనసాగుతుంది.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 840 పాయింట్ల మేరకు ర్యాలీ సాధించి వారం గరిష్ఠ స్థాయి 60,000 సమీపంలో ముగిసింది. మరోసారి గరిష్ఠ స్థాయిల వద్ద పరీక్షకు సమాయత్తం అవుతోంది. ట్రెండ్‌లో సానుకూలత కోసం నిరోధ స్థాయి 60,500 వద్ద నిలదొక్కుకుని తీరాలి. ప్రస్తుత మద్దతు స్థాయి 60,000 వద్ద విఫలమైతే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుంది.
పాటర్న్: మార్కెట్ ప్రస్తుతం 50, 100 డీఎంఏల కన్నా దిగువన ఉంది. ప్రధాన ట్రెండ్ ఇప్పటికీ దిగువకే ఉంది. ట్రెండ్‌లో సానుకూలత కోసం 26,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద నిలదొక్కుకుని తీరాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్ రివర్సల్స్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 25,850, 25,920
మద్దతు : 25,600, 25,530
వి. సుందర్ రాజా
ఈ వార్తలు కూడా చదవండి..
మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..
మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..
For More Devotional News And Telugu News