Share News

Coca Cola HCCB IPO: కోకా-కోలా భారత బాట్లింగ్ యూనిట్ HCCB నుంచి రూ.9 వేల కోట్ల ఐపీఓ

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:22 AM

కోకా-కోలా తన భారతీయ బాట్లింగ్ సంస్థ హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్‌ను పబ్లిక్‌ ఇష్యూకు తీసుకురాబోతోంది. ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ.9,027 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో కంపెనీ విలువ సుమారు రూ. 90,000 కోట్లు ఉండే లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Coca Cola HCCB IPO: కోకా-కోలా భారత బాట్లింగ్ యూనిట్ HCCB నుంచి రూ.9 వేల కోట్ల ఐపీఓ
Coca-Cola HCCB IPO

అట్లాంటా, జనవరి 18: ప్రపంచంలోనే అతిపెద్ద బెవరేజ్ కంపెనీ కోకా-కోలా తన భారతీయ బాట్లింగ్ సంస్థ హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్(HCCB)ను పబ్లిక్‌గా లిస్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ IPO ద్వారా సుమారు ఒక బిలియన్ డాలర్లు(సుమారు రూ.9,027 కోట్లు) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ విలువ 10 బిలియన్ డాలర్లు(సుమారు రూ.90,000 కోట్లు) ఉండే లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఈ IPO 2026 వేసవిలో(సమ్మర్) లాంచ్ చేయాలని ప్రణాళిక. అయితే.. గతేడాదిలా వర్షాల వల్ల పీక్ సమ్మర్ డిమాండ్ తీవ్రంగా పడిపోతే, దీనిని 2027కి వాయిదా వేయవచ్చని సమాచారం. కోటక్ మహీంద్రా క్యాపిటల్, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్, సిటీ బ్యాంక్ వంటి ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను ఈ ప్రక్రియకు నియమించారు.

HCCB భారతదేశంలో కోకా-కోలా, థమ్స్‌అప్, స్ప్రైట్, మాజా, కిన్లీ, దసాని, జార్జియా కాఫీ, ష్వెప్స్ వంటి బ్రాండ్లను తయారు చేసి, పంపిణీ చేస్తుంది. దేశంలోని రూ.60,000 కోట్ల సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది. HCCB 15 ప్లాంట్లతో పనిచేస్తోంది. మిగిలిన ఆపరేషన్లు ఇతర ఇండిపెండెంట్ బాట్లర్ల ద్వారా జరుగుతాయి.


గత సంవత్సరం కోకా-కోలా తన గ్లోబల్ అసెట్-లైట్ వ్యూహంలో భాగంగా HCCB పేరెంట్ ఎంటీటీలో 40 శాతం వాటాను జుబిలెంట్ గ్రూప్(Jubilant Bhartia)కు రూ. 12,500 కోట్లకు అమ్మింది. ఈ IPO కూడా అదే వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. బాట్లింగ్ ఆపరేషన్ల నుంచి దూరమై.. బ్రాండ్ బిల్డింగ్, ఇన్నోవేషన్, డిజిటైజేషన్‌పై దృష్టి పెట్టడం దీని లక్ష్యంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఫైనాన్షియల్ ఇయర్(FY)25లో HCCB రెవెన్యూ రూ.12,751 కోట్లు (9 శాతం తగ్గుదల) నమోదైంది. ఇది ప్లాంట్లను ఫ్రాంచైజీ బాట్లర్లకు అమ్మడం వల్ల వచ్చిన ప్రభావమని చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా అన్‌సీజనల్ రెయిన్స్ వల్ల కూడా సాఫ్ట్ డ్రింక్స్ సేల్స్ ప్రభావితమయ్యాయి.

ఇక.. ఈ IPO భారతదేశంలో MNCల బిగ్ లిస్టింగ్‌ల ట్రెండ్‌లో భాగమవుతుంది. ఇంతకుముందు హుందాయ్ Hyundai($3.3 బిలియన్), ఎల్‌జీ LG($1.3 బిలియన్) తర్వాత మరో మెగా డీల్‌గా నిలవనుంది. ఈ ఐపీఓ విజయవంతమైతే.. భారత FMCG మార్కెట్‌లో కోకా-కోలా బలాన్ని మరింత పెంచుతుంది.. ఇన్వెస్టర్లకు ఆకర్షణీయ అవకాశంగా మారనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..

మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..

For More Devotional News And Telugu News

Updated Date - Jan 18 , 2026 | 11:42 AM