Gold, Silver Rates Jan 18: పసిడి, వెండి ధరల్లో కొనసాగుతున్న పెరుగుదల! నేటి రేట్స్ ఇవీ..
ABN , Publish Date - Jan 18 , 2026 | 06:34 AM
బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కొనసాగుతోంది. గురు, శుక్ర వారాల్లో కాస్త తగ్గిన ధరలు శనివారం మళ్లీ పెరిగాయి. మరి ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. సుంకాలను పెంచుతామంటూ అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వెరసి ఇన్వెస్టర్లను సురక్షిత పెట్టుబడి సాధనాలైన బంగారం, వెండి వైపు మళ్లేలా చేస్తోంది. ఫలితంగా ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. జనవరిలో ఇప్పటివరకూ బంగారం ధర సుమారు 7 శాతం మేర పెరిగింది. పసిడిని మించి వెండి ధర పరుగులు పెడుతోంది (Gold and Silver Rates on Jan 18 2026).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నేడు (ఆదివారం, జనవరి 18) ఉదయం 6.00 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,780గా ఉంది. 22 క్యారెట్ బంగారం ధర రూ. 1,31,800 వద్ద తచ్చాడుతోంది. ముంబై, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే రేటు కొనసాగుతోంది. ఇక చెన్నైలో అత్యధికంగా 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,870గా ఉంది. 22 క్యారెట్ బంగారం ధర రూ.1,32,800 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో నిన్న కిలో వెండి రేటు కూడా సుమారు నాలుగు వేల మేర పెరిగింది. ప్రస్తుతం స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,10,000గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ముంబైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,95,000గా ఉంది.
వివిధ నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు ఇవీ
చెన్నై: ₹1,44,870; ₹1,32,800;
ముంబై: ₹1,43,780; ₹1,31,800;
న్యూఢిల్లీ: ₹1,43,930; ₹1,31,950;
కోల్‌కతా: ₹1,43,780; ₹1,31,800;
బెంగళూరు: ₹1,43,780; ₹1,31,800;
హైదరాబాద్: ₹1,43,780; ₹1,31,800;
విజయవాడ: ₹1,43,780; ₹1,31,800;
కేరళ: ₹1,43,780; ₹1,31,800;
పుణె: ₹1,43,780; ₹1,31,800;
వడోదరా: ₹1,43,830; ₹1,31,850;
అహ్మదాబాద్: ₹1,43,830; ₹1,31,850;
కిలో వెండి ధరలు ఇలా..
చెన్నై: ₹3,10,000
ముంబై: ₹2,95,000
న్యూఢిల్లీ: ₹2,95,000
కోల్‌కతా: ₹2,95,000
బెంగళూరు: ₹2,95,000
హైదరాబాద్: ₹3,10,000
విజయవాడ: ₹3,10,000
కేరళ: ₹3,10,000
పూణె: ₹2,95,000
వడోదరా: ₹2,95,000
అహ్మదాబాద్: ₹2,95,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
Financial Planning: కాలం మారింది..మీరూ మారాలి..
గుడ్ న్యూస్.. త్వరలోనే పీఎఫ్ డబ్బులు మీ అకౌంట్‌లో..