Share News

Reliance Q3 Results 2026: రిలయన్స్‌ లాభం రూ.18,645 కోట్లు

ABN , Publish Date - Jan 17 , 2026 | 06:20 AM

వర్తమాన ఆర్థిక సంవత్సరండిసెంబరు త్రైమాసికానికి (క్యూ3) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.18,645 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన...

Reliance Q3 Results 2026: రిలయన్స్‌ లాభం రూ.18,645 కోట్లు

  • ఆదాయం రూ.2.69 లక్షల కోట్లు

  • రిటైల్‌ వ్యాపారం డీలా..

  • కేజీ బేసిన్‌లో తగ్గిన గ్యాస్‌ ఉత్పత్తి

ముంబై: వర్తమాన ఆర్థిక సంవత్సరండిసెంబరు త్రైమాసికానికి (క్యూ3) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.18,645 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.18,540 కోట్లతో పోలిస్తే లాభం కేవలం 0.60ు పెరిగింది. డిజిటల్‌, ఎన ర్జీ విభాగాలు మంచి పనితీరు కనబరిచినప్పటికీ, జీఎ్‌సటీ రేట్ల హేతుబద్ధీకరణ కారణంగా రిటైల్‌ వ్యాపారం డీలా పడ టం, కేజీ బేసిన్‌ నుంచి గ్యాస్‌ ఉత్పత్తి తగ్గుదల ఇందుకు దోహదపడ్డాయి. అయితే క్యూ3లో ఆదాయం మాత్రం 10.51ు వృద్ధితో రూ.2,69,496 కోట్లకు ఎగబాకింది. 2024-25లో ఇదే కాలానికి రెవెన్యూ రూ.2,43,865 కోట్లుగా నమోదైంది. కాగా, 2025 సెప్టెంబరు చివరినాటికి రూ.1,18,545 కోట్లుగా ఉన్న కంపెనీ నికర రుణ భారం.. డిసెంబరు చివరికల్లా రూ.1,17,102 కోట్లకు తగ్గింది.

జియో లాభంలో 11.3% వృద్ధి

టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియోతోపాటు డిజిటల్‌ వ్యాపారాలన్నింటినీ ఒకే గొడుగు కింద చేర్చి ఏర్పాటు చేసిన జియో ప్లాట్‌ఫామ్స్‌ నికర లాభం ఈ క్యూ3లో 11.3ు వృద్ధితో రూ.7,629 కోట్లకు పెరిగింది. రిలయన్స్‌ జియో కస్టమర్ల సంఖ్య, ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయం (ఆర్పూ) గణనీయంగా పెరగడంతోపాటు డిజిటల్‌ సేవల విస్తరణ ఇందుకు దోహదపడింది. సమీక్షా త్రైమాసికానికి జియో ప్లాట్‌ఫామ్‌ ఆ దాయం వార్షిక ప్రాతిపదికన 12.7ు వృద్ధితో రూ.37,262 కోట్లకు చేరుకుంది. ఈ క్యూ3లో రిలయన్స్‌ జియో ఆర్పూ 5.1ు పెరిగి రూ.213.7కు చేరుకుంది.


ఓ2సీ ఆదాయం రూ.1.62 లక్షల కోట్లు

రిలయన్స్‌కు చెందిన ఆయిల్‌ టు కెమికల్స్‌ (ఓ2సీ) విభాగ వ్యాపారం ఆదాయం ఈ క్యూ3లో 8.4 శాతం పెరిగి రూ.1,62,095 కోట్లకు చేరుకుంది. ఎగుమతులు మాత్రం 1.2ు తగ్గి రూ.66,830 కోట్లకు పరిమితం అయ్యాయి. కాగా, ఎటిబా 14.6ు పెరిగి రూ.16,507 కోట్లకు ఎగబాకగా.. ఎబిటా మార్జిన్‌ కూడా 10.2 శాతానికి పెరిగింది.

ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఆదాయం 8.4% డౌన్‌

కంపెనీ చెందిన ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ అన్వేషణ, ఉత్పత్తి విభాగం ఆదాయం ఈ క్యూ3లో 8.4ు తగ్గి రూ.5,833 కోట్లకు పడిపోగా.. ఎబిటా 12.7ు తగ్గి రూ.4,857 కోట్లకు పరిమితమైంది. కేజీ బేసిన్‌ నుంచి సహజ వాయువు ఉత్పత్తితోపాటు దాని ధర కూడా తగ్గడం ఇందుకు కారణం.

జియోస్టార్‌ లాభం రూ.888 కోట్లు

సెప్టెంబరుతో ముగిసిన క్యూ2తో పోలిస్తే, క్యూ3లో కంపెనీ మీడియా వ్యాపార విభాగమైన జియోస్టార్‌ ఆదాయం రూ.8,010 కోట్లకు పెరగగా.. నికర లాభం మాత్రం రూ.888 కోట్లకు తగ్గింది.

రిటైల్‌పై మార్జిన్ల ఒత్తిడి

డిసెంబరుతో ముగిసిన మూడు నెలల్లో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) ఆదాయం వార్షిక ప్రాతిపదికన 9.2ు పెరిగి రూ.86,951 కోట్లకు చేరుకుంది. నికర లాభం మాత్రం 2.7ు వృద్ధితో రూ.3,551 కోట్లకు పరిమితమైంది. జీఎ్‌సటీ రేట్ల తగ్గింపుతోపాటు కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపార విభజనతో లాభాల మార్జిన్లపై ఒత్తిడి ఇందుకు కారణమైంది. గత మూడు నెలల్లో ఆర్‌ఆర్‌వీఎల్‌ కొత్తగా 431 స్టోర్లను ప్రారంభించింది. దాంతో మొత్తం విక్రయ కేంద్రాల సంఖ్య 19,979కి పెరిగింది.

ఇవీ చదవండి:

30 వాట్స్ లేదా 60 వాట్స్ చార్జర్.. బ్యాటరీ మన్నికకు ఏది బెటర్?

వైద్య కళాశాలల అవసరం భవిష్యత్తులో ఉండదు.. ఎలాన్ మస్క్ వ్యాఖ్య

Updated Date - Jan 17 , 2026 | 06:20 AM