Wipro Q3 Profit Decline: విప్రో లాభంలో 7శాతం క్షీణత
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:03 AM
ఐటీ సర్వీసుల దిగ్గజాల్లో ఒకటైన విప్రో...డిసెంబరు 31వ తేదీతో ముగిసిన వర్తమాన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక లాభంలో 7% క్షీణతను నమోదు చేసింది. కార్మిక చట్టాల...
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజాల్లో ఒకటైన విప్రో...డిసెంబరు 31వ తేదీతో ముగిసిన వర్తమాన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక లాభంలో 7% క్షీణతను నమోదు చేసింది. కార్మిక చట్టాల అమలు, పునర్ వ్యవస్థీకరణ వ్యయాల కారణంగా కంపెనీ లాభం గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే రూ.3,353.8 కోట్ల నుంచి రూ.3,119 కోట్లకు తగ్గింది. కొత్త కార్మిక చట్టాల ప్రభావం కంపెనీపై రూ.302.8 కోట్ల మేరకు పడిందని వెల్లడించింది. దీనికి అదనంగా పునర్నిర్మాణ వ్యయాల భారం రూ.263 కోట్లు పడినట్టు తెలిపింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 5.5% పెరిగి రూ.23,555.8 కోట్లకు చేరింది. విప్రో డైరెక్టర్ల బోర్డు రూ.2 ముఖవిలువ గల ఒక్కో షేరుపై రూ.6 మధ్యంతర డివిడెండును ప్రకటించింది. డివిడెండుకు రికార్డు తేదీ జనవరి 27 కాగా ఫిబ్రవరి 14 లోగా అర్హులందరికీ చెల్లింపులు పూర్తి చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.
ఇవీ చదవండి:
30 వాట్స్ లేదా 60 వాట్స్ చార్జర్.. బ్యాటరీ మన్నికకు ఏది బెటర్?
వైద్య కళాశాలల అవసరం భవిష్యత్తులో ఉండదు.. ఎలాన్ మస్క్ వ్యాఖ్య