Illegal Walkie Talkie Sale India: అక్రమంగా వాకీ టాకీల విక్రయం..
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:06 AM
ఆన్‌లైన్‌లో అక్రమంగా వాకీ-టాకీలను విక్రయించినందుకుగాను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషోతో పాటు ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్ మాతృసంస్థ మెటాపై సెంట్రల్ కన్స్యూమర్...
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మెటా, మీషోపై 10 లక్షల చొప్పున జరిమానా
న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో అక్రమంగా వాకీ-టాకీలను విక్రయించినందుకుగాను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషోతో పాటు ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్ మాతృసంస్థ మెటాపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019తో పాటు టెలికం నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ-కామర్స్ సంస్థలు తమ వేదికల ద్వారా వాకీ-టాకీల విక్రయాలు జరిపినందుకు సుమోటో చర్యలను ప్రారంభించింది. 8 సంస్థలకు తుది ఆర్డర్లు జారీ చేయడమే కాకుండా వాటన్నింటికీ కలిపి మొత్తం రూ.44 లక్షల జరిమానా విధించింది. సీసీపీఏ నోటీసులు జారీ చేసిన సంస్థల జాబితాలో చిమియ, జియోమార్ట్, టాక్ ప్రో, మీషో, మాస్క్‌మ్యాన్ టాయ్స్, ట్రేడ్‌ఇండియా, అంతరిక్ష్ టెక్నాలజీస్, వర్దాన్‌మార్ట్, ఇండియామార్ట్, ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్, ఫ్లిప్‌కార్ట్, కృష్ణమార్ట్, అమెజాన్ ఉన్నాయి.
ఇవీ చదవండి:
30 వాట్స్ లేదా 60 వాట్స్ చార్జర్.. బ్యాటరీ మన్నికకు ఏది బెటర్?
వైద్య కళాశాలల అవసరం భవిష్యత్తులో ఉండదు.. ఎలాన్ మస్క్ వ్యాఖ్య