Harish Rao notices: ఫోన్ ట్యాపింగ్ కేసు.. హరీష్‌రావుకు నోటీసులు..
ABN , Publish Date - Jan 19 , 2026 | 08:58 PM
బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాఫ్తు చేస్తున్న సిట్ నోటీసులు ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది (Harish Rao phone tapping case). బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాఫ్తు చేస్తున్న సిట్ నోటీసులు ఇచ్చింది. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని హరీష్ రావుకు పంపిన నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా హరీష్ రావుకు సిట్ నోటీసులు పంపించింది.
ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణపై దర్యాఫ్తు సంస్థను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతించామని, ఇంకెంత కాలం విచారణ కొనసాగిస్తారని ప్రశ్నించింది. ఈ కేసులో విచారించడానికి ఇంకా ఏమి మిగిలి ఉందని ప్రశ్నించింది. ప్రభాకర్ రావు విచారణను త్వరగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
ఎనిమిది యుద్ధాలు ఆపినా నోబెల్ ఇవ్వలేదు.. ఇక శాంతి గురించి ఆలోచించను: ట్రంప్
తాలిబన్లు రాక ముందు.. అఫ్గానిస్థాన్ ఎంత ఆధునికంగా ఉండేదో తెలుసా..