ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్.. (19/01/2026)
ABN , First Publish Date - Jan 19 , 2026 | 06:37 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Updates
-
Jan 19, 2026 10:07 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. పలువురికి గాయాలు
కాకినాడ జిల్లా చేబ్రోలు వద్ద బస్సు బోల్తా.. 9 మందికి స్వల్ప గాయాలు
జగ్గంపేట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
నెల్లూరు జిల్లా సీతారామపురం సమీపంలో కారు బోల్తా.. ఐదుగురికి గాయాలు
-
Jan 19, 2026 09:48 IST
ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం
వేగంగా వచ్చి యాక్టివాపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొన్న లారీ
లారీ చక్రాల కింద నలిగి వ్యక్తి అక్కడిక్కడే మృతి
-
Jan 19, 2026 09:13 IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ఎంపీకి ఈడీ నోటీసులు
ఈనెల 23న విచారణకు రావాలని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి నోటీసులు
ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడీ అనుమానం
హవాలా, మనీలాండరింగ్ రూపంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు అనుమానం
ఇప్పటికే ఇదే కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిన ఈడీ
-
Jan 19, 2026 08:14 IST
ఘోర ప్రమాదం
జార్ఖండ్: లతహార్ జిల్లా మహువాడండ్ పరిధిలో ఘోర ప్రమాదం
ఓర్సా వ్యాలీ ప్రాంతంలో బోల్తాపడిన స్కూల్ బస్సు
ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. 85మందికి గాయాలు
గాయపడిన వారిని మహువాడండ్ ఆసుపత్రికి తరలింపు
బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సును నియంత్రించలేకపోయిన డ్రైవర్
-
Jan 19, 2026 08:11 IST
ఘనంగా నాగోబా జాతర ప్రారంభం..
ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఘనంగా నాగోబా జాతర
ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా నాగోబా జాతర
ఆదివాసీ సంప్రదాయ రీతిలో సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య ప్రారంభం
నాగోబాను గంగా జలంతో అభిషేకిస్తూ ప్రత్యేక పూజలు చేసిన మెస్రం వంశీయులు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు
-
Jan 19, 2026 07:26 IST
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం
దక్షిణ స్పెయిన్‌లోని అడమూజ్ టౌన్ వద్ద ఢీకొన్న రెండు హైస్పీడ్ రైళ్లు
మలాగా నుంచి మ్యాడ్రిడ్‌కు వెళుతున్న రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం
పక్క ట్రాక్‌పై వెళుతున్న మరో హైస్పీడ్ రైలును ఢీకొట్టిన రైలు
ఈ ప్రమాదంలో 21 మంది దుర్మరణం, 73 మందికి గాయాలు
-
Jan 19, 2026 07:03 IST
చుక్కల్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు
సోమవారం ఉదయం 6.00 గంటల సమయానికి రూ.1,43,770కు చేరిన తులం బంగారం
కిలో రూ.3లక్షలు దాటి ప్రస్తుతం రూ.3,09,900 వద్ద కొనసాగుతున్న వెండి
బంగారం, వెండి కొనాలంటేనే వణికిపోతున్న కొనుగోలుదారులు
-
Jan 19, 2026 07:00 IST
మేడారంలో క్యాబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు
వచ్చేనెలలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు క్యాబినెట్ నిర్ణయం
2027 గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు
మెట్రో రెండో దశ భూసేకరణకు పచ్చజెండా
2,787 కోట్లు కేటాయించాలని నిర్ణయం
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు హైలెవల్ బ్రిడ్జి
నిర్ణయాలను వెల్లడించిన పొంగులేటి
-
Jan 19, 2026 06:46 IST
క్రెడిబిలిటీ ఎవరికుందో కూడా తెలుసు: సీఎం చంద్రబాబు
అభివృద్ధి చేయలేని వాళ్లకే క్రెడిట్ పాట్లు: సీఎం చంద్రబాబు
అధికారంలో ఉన్నప్పుడు 3 ముక్కలాట: సీఎం చంద్రబాబు
3 ప్రాంతాల్లోనూ చావుదెబ్బతిన్నారు: సీఎం చంద్రబాబు
పిన్నమ్మ పుస్తెలు తెంచిన నేరస్థులను రాజకీయం ముసుగులో కాపాడుతున్నారు: సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధానా..?: సీఎం చంద్రబాబు