Vallabhaneni Vamshi: వంశీకి ఇక దబిడి దిబిడే..
ABN, Publish Date - Feb 24 , 2025 | 07:00 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్‌తో దర్యాప్తు జరిపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అతని అక్రమాలపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది.
అమరావతి, ఫిబ్రవరి 24: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్‌తో దర్యాప్తు జరిపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అతని అక్రమాలపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది. వంశీ అరాచకాలు, అక్రమాలపై విచారణ కోసం నలుగురు విచారణాధికారులతో కూడిన సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్‌కు జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్ సహా భూ కబ్జాలపై సిట్ దర్యాప్తు చేయనుంది.
Updated Date - Feb 24 , 2025 | 07:00 PM