మళ్లీ జగన్ వస్తే విపత్తు ఎలా ఉండేదో: పవన్
ABN, Publish Date - Jan 19 , 2025 | 02:00 PM
గత (జగన్) ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే విపత్తు ఎలా ఉండేదో అందరూ చూసేవారని, గతంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలను ఆ విపత్తు నుంచి కాపాడేలా కూటమి పార్టీలు కలిసి పని చేశాయన్నారు. అటువంటి విపత్తు రాష్ట్రానికి రాకూడదని మోదీ, అమిత్ షా సూచనలు, సహకారంతో ముందుకు సాగామన్నారు.
అమరావతి: దక్షిణ భారతదేశ డిజార్డర్స్ మేనేజ్‌మెంట్ కార్యాలయం ఏపీలో నిర్మించడం ఆనందంగా ఉందని.. ఈ సందర్భంగా అమిత్ షా, ప్రధాని మోదీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ టీం ధైర్యసాహసాలతో ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాయని, తుఫాన్, భూపకంపం, సునామీ వంటి ప్రమాదాల సమయంలో వారు ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజలను రక్షిస్తున్తున్నారని అన్నారు. ఇక్కడ సిఎం చంద్రబాబు స్థలం ఇచ్చి.. నిర్మాణానికి సహకారం ఇచ్చారని పవన్ కొనియాడారు.
గత (జగన్) ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే విపత్తు ఎలా ఉండేదో అందరూ చూసేవారని, గతంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారని పవన్ అన్నారు. ప్రజలను ఆ విపత్తు నుంచి కాపాడేలా కూటమి పార్టీలు కలిసి పని చేశాయన్నారు. అటువంటి విపత్తు రాష్ట్రానికి రాకూడదని మోదీ, అమిత్ షా సూచనలు, సహకారంతో ముందుకు సాగామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీల స్థాయిలో కూడా విపత్తులను ఎదుర్కొనేలా ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. అమిత్ షా చెప్పిన ఈ సూచనలను మేము గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్నామని, ప్రజలు కూడా బాధ్యతతో అవసరమైన సమయంలో సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిఎం రేవంత్ రెడ్డి మరో కీలక ముందడుగు
హెల్త్ వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం..
అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 19 , 2025 | 02:00 PM