Yadagirigutta: 48 రోజుల్లో రూ. 4.17కోట్ల ఆదాయం
ABN, Publish Date - Jan 21 , 2025 | 05:38 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయ ఖజానాకు 48 రోజుల్లో రూ.4.17కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.
యాదగిరీశుడి హుండీ కానుకల లెక్కింపు
భువనగిరి అర్బన్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయ ఖజానాకు 48 రోజుల్లో రూ.4.17కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. గత ఏడాది డిసెంబరు 3 నుంచి ఈ నెల 19వ తేదీవరకు నృసింహుడిని దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన మొక్కు కానుకలను సోమవారం లెక్కించారు. కానుకల్లో మిశ్రమ బంగారం, వెండి, అమెరికా డాలర్లు కూడా ఉన్నట్లు ఈవో తెలిపారు.
Updated Date - Jan 21 , 2025 | 05:38 AM