ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Siddipet: పెళ్లైన ఏడేళ్లకు గర్భం..

ABN, Publish Date - Feb 25 , 2025 | 05:16 AM

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు ఓ మహిళ జన్మనిచ్చింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది.

  • ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిన తల్లి

గజ్వేల్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు ఓ మహిళ జన్మనిచ్చింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. ములుగు మండలం అడవిమజీద్‌కు చెందిన నాగరత్న-నర్సింహులుకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి పిల్లలు కాకపోవడంతో అనేక ఆస్పత్రులకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం పొందగా నాగరత్న గర్భం దాల్చింది.


తొమ్మిది నెలలుగా గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో నొప్పులు రావడంతో ఆదివారం నాగరత్నను ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు మగ, ఒక ఆడపిల్ల జన్మించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అన్నపూర్ణ తెలిపారు. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని చెప్పారు.

Updated Date - Feb 25 , 2025 | 05:17 AM