TG News: పట్టపగలు నడిరోడ్డుపై దారుణం.. చోద్యం చూస్తున్న జనం
ABN, Publish Date - Jan 22 , 2025 | 01:33 PM
Telangana: రాజ్‌కుమార్ ఆటోలో ఉన్న సమయంలో అతడి ప్రత్యర్థి అక్కడకు చేరుకున్నాడు. వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో రాజ్‌కుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆటోడ్రైవర్ కడుపులో దాదాపు 15 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న వ్యక్తులు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు వ్యక్తి.. ఆపకుండా పదేపదే పొడిచాడు.
హనుమకొండ, జనవరి 22: హనుమకొండ (Hanumakonda) నగరం నడిబొడ్డులో దారుణం జరిగింది. ఒళ్లుగగుర్పొడిచే విధంగా పట్టపగలే ఆటో డ్రైవర్ హత్య కలకలం రేపుతోంది. ఆదాల జంక్షన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు మణికొండకు చెందిన మాచర్ల రాజ్‌కుమార్‌కు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే సుబేదార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఓ వైపు వ్యక్తి దారుణ హత్యకు గురవుతుంటే చుట్టూ ఉన్న జనం మాత్రం చోద్యం చూస్తూ నిలబడ్డారు. పైగా హత్య జరిగే దృశ్యాలను తమ తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. మనుషుల్లో మానవత్వం మంటగలిసిందనే దానికి ఉదాహరణంగా నిలిచింది ఈ ఘటన.
కాగా.. ఎంతో రద్దీ ఉండే హైదరాబాద్ - వరంగల్ ప్రధాన హైవే వద్ద ఆదాల జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ రాజ్‌కుమార్‌ను ప్రత్యర్ధి దారుణంగా చంపేశాడు. రాజకుమార్ ఆటోలో ఉన్న సమయంలో ఏనుగు వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకున్నాడు. వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో రాజ్‌కుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆటోడ్రైవర్ కడుపులో దాదాపు 15 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న వ్యక్తులు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు వ్యక్తి.. ఆపకుండా పదేపదే పొడిచాడు. రాజ్‌కుమార్ కిందపడినప్పటికీ వదలకుండా చివరకు గొంతులో కూడా కత్తితో పొడిచాడు. దీంతో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆపై నిందితుడు వెంకటేశ్వర్లు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారందరికీ కత్తి చూపించి బెదిరిస్తూ నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన హనుమకొండలో తీవ్ర కలకలం రేపింది.
వైసీపీ మాజీ మంత్రిపై కేసు.. విషయం ఇదే..
ఇదే కారణమా..
ఓ మహిళ విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదమే హత్యకు కారణంగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఓ మహిళతో రాజ్‌కుమార్, వెంకటేశ్వర్లు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి రాజ్ కుమార్‌ను వెంకటేశ్వర్లు హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు సుబేదారి పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు పోలీసులు. నిందితుడి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు, మృతుడు ఇద్దరు కూడా ఆటో డ్రైవర్లే. ఎప్పటికీ రద్దీగా ఉండే ప్రాంతంలో, జిల్లా కోర్టుకు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం సంచలనం రేపుతోంది.
ఇవి కూడా చదవండి..
BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్
Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 22 , 2025 | 01:41 PM