ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Siddipet: శివాజీ జయంతి వేడుకల్లో ప్రమాదం

ABN, Publish Date - Feb 20 , 2025 | 04:12 AM

ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో కరెంట్‌ షాక్‌ తగిలి ఒకరు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శివాజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం జెబ్బాపూర్‌ గ్రామంలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.

  • జెండా ఎగరేస్తుండగా కరెంట్‌ షాక్‌తో ఒకరి మృతి

  • ఒకరి పరిస్థితి విషమం.. ఆరుగురికి తీవ్ర గాయాలు

వర్గల్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో కరెంట్‌ షాక్‌ తగిలి ఒకరు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శివాజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం జెబ్బాపూర్‌ గ్రామంలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గ్రామ కూడలి వద్ద కాషాయ జెండా ఎగరవేసే క్రమంలో జెండాకు ఉన్న ఇనుప పైపునకు విద్యుత్‌ వైర్లు తగిలి షాక్‌ వచ్చింది.


దీంతో పైపును పట్టుకుని ఉన్న లింగ ప్రశాంత్‌తో పాటు మరికొందరు విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. వీరిని చికిత్స కోసం గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా లింగ ప్రశాంత్‌(22) మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు. దేశెట్టి కరుణాకర్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Updated Date - Feb 20 , 2025 | 04:12 AM