ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kamalapur: కౌశిక్‌రెడ్డిపై కోడిగుడ్లతో దాడి

ABN, Publish Date - Jan 25 , 2025 | 05:02 AM

సభలో కౌషిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సంవత్సరం దాటినా ఆరు పథకాలు, 66 హామీలను నెరవేర్చకపోవడంతో పాటు కాలయాపన చేస్తోందని అన్నారు.

కమలాపూర్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కౌషిక్‌రెడ్డిపై కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తలు టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. సభలో కౌషిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సంవత్సరం దాటినా ఆరు పథకాలు, 66 హామీలను నెరవేర్చకపోవడంతో పాటు కాలయాపన చేస్తోందని అన్నారు.


ఊకదంపుడు మాటలు మాట్లాడుతూ కాలం వెల్లదీస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీజేపీలతో ఎలాంటి పనులు జరుగవని, బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేసిందని తెలిపారు. ఇలా ఎమ్మెల్యే మాట్లాడుతుండ డంతో ఆగ్రహానికి గురైన బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎమ్మెల్యేలపై టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందని నిలదీశారు. పోలీసులు సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..

Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం

Updated Date - Jan 25 , 2025 | 05:02 AM