Sridhar Babu: 25, 26న ‘బయో ఏషియా- 2025’
ABN, Publish Date - Feb 21 , 2025 | 04:13 AM
హెల్త్‌టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ఈ నెల 25, 26 తేదీల్లో ‘బయో ఏషియా- 2025’ సదస్సును నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.
కృత్రిమ మేధ ప్రధానాంశంగా చర్చ:మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): హెల్త్‌టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ఈ నెల 25, 26 తేదీల్లో ‘బయో ఏషియా- 2025’ సదస్సును నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. కృత్రిమ మేధ(ఏఐ) ప్రధానాంశంగా ఈ సదస్సును నిర్వహిస్తామని, ఏఐ-ఆధారిత ఆరోగ్య సంరక్షణ-పరివర్తన, లైఫ్ సైన్సె్‌సలో ఆవిష్కరణలు, డాటా ఇంటర్-ఆపరేబిలిటీ, క్లినికల్ ట్రయల్స్‌లో భారత్ పాత్ర తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ఈ వేదిక ద్వారా లైఫ్‌సైన్సెస్, ఫార్మా రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, ఆవిష్కర్తలను ఒకే చోట చేర్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని.. సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ఈసీ కన్నా జగన్ గొప్పవాడా?
Also Read: ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక
Also Read: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక మార్పులు..
Also Read: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు
Also Read: రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆప్ ఎంపీ ప్రత్యక్షం
For Telangana News And Telugu News
Updated Date - Feb 21 , 2025 | 04:13 AM