Sridhar Babu: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అండ
ABN, Publish Date - Mar 01 , 2025 | 05:01 AM
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పరిశ్రమల స్థాపనలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రోత్సాహకాలపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం
నెలాఖరులో రూ.300 కోట్ల బకాయిల విడుదల: శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పరిశ్రమల స్థాపనలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నగరంలోని తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) భవన్‌లో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, అధికారులతో కూడిన బృందం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తుందని చెప్పారు. ఆయా ప్రభుత్వాలు దళిత పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహకాలపై బృందం అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు.
ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తలకు మరింత ప్రయోజనం కలిగే లా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ‘మినీ ఇండస్ట్రియల్ పార్క్’ను మహిళల కోసం అభివృద్ధి చేస్తామని, ఇందులో ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10ు ప్రత్యేకంగా కేటాయిస్తామన్నారు. 2017 నుంచి సబ్సిడీల కింద పారిశ్రామికవేత్తలకు అందాల్సిన బకాయిలు రూ.4500 కోట్లకు పైగా ఉన్నాయ ని, వీటిలో రూ.2200 కోట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కే రావాలని చెప్పారు. ఈనెల చివరినాటికి రూ.300 కోట్లు చెల్లిస్తామని తెలిపారు. కాగా, రాష్ట్రంలోని ఎంఎ్‌సఎంఈలకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్రప్రభుత్వం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎ్‌సఈ) సహకారం తీసుకోనుం ది. ఈ మేరకు శుక్రవారం ఎఫ్‌టీసీసీఐ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సఈ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పం దం కుదిరింది. పారిశ్రామికవేత్తలకు రుణాల విషయంలో సహకరించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని పరిశ్రమలశాఖ సంచాలకులు మల్సూర్ తెలిపారు.
Updated Date - Mar 01 , 2025 | 05:01 AM