Singer Kalpana: సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం..
ABN, Publish Date - Mar 04 , 2025 | 09:05 PM
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు ఆమెను హోలిస్టిక్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సింగర్ కల్పనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్, మార్చి 04: ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు ఆమెను హోలిస్టిక్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సింగర్ కల్పనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిల్లేజ్‌లో ప్రసాద్ అనే వ్యక్తితో కలిసి కల్పన నివసిస్తున్నారు. ఈ క్రమంలో.. వ్యక్తిగత కారణాలతో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కల్పనను స్థానిక ప్రైవేట్ హోలిస్టిక్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కల్పన స్పృహలోకి రావడంతో.. పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అయితే, కల్పన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
Also Read:
బనకచర్లపై ఒక పార్టీ రాజకీయం చేస్తుంది
For More Telangana News and Telugu News..
Updated Date - Mar 04 , 2025 | 09:05 PM