ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Singareni: రాజస్థాన్‌లో 3,100 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాలు

ABN, Publish Date - Mar 04 , 2025 | 04:54 AM

రాజస్థాన్‌ విద్యుత్‌ ఉత్పాదన్‌ నిగం లిమిటెడ్‌ (ఆర్‌వీయూఎన్‌ఎల్‌)తో కలిసి 3,100మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

సింగరేణి, ఆర్‌వీయూఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో నిర్మాణం

74% సింగరేణి, 26ు ఆర్‌వీయూఎన్‌ఎల్‌ పెట్టుబడి

రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు ఎంవోయూ

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): వ్యాపార విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ కీలక ముందడుగు వేసింది. రాజస్థాన్‌ విద్యుత్‌ ఉత్పాదన్‌ నిగం లిమిటెడ్‌ (ఆర్‌వీయూఎన్‌ఎల్‌)తో కలిసి 3,100మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జైపూర్‌లో రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో సోమవారం జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు సింగరేణి, ఆర్‌వీయూఎన్‌ఎల్‌ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లో 1500 మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రం, మరో 1600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. జాయింట్‌ వెంచర్‌లో సింగరేణి సంస్థ 74శాతం, ఆర్‌వీయూఎన్‌ఎల్‌ సంస్థ 26శాతం చొప్పున పెట్టుబడి పెట్టనున్నాయి. సింగరేణి సంస్థ మూలధన రూపంలో తన వాటా చెల్లించనుండగా, విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు, మౌలిక సదుపాయాల రూపంలో తన వాటాను ఆర్‌వీయూఎన్‌ఎల్‌ భరించనుంది. విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం పూర్తయిన తర్వాత సంబంధిత కొనుగోలు ఒప్పందాలు చేసుకునే బాధ్యత సైతం రాజస్థాన్‌ విద్యుత్‌ శాఖనే చేపట్టనుంది. కాగా, విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు, లాభదాయకత, నిర్మాణ అంశాలపై చర్చించేందుకు ఇరుపక్షాల నిపుణులతో కామన్‌ వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్రాలు నిర్ణయించాయి. పరస్పర అవగాహనతో లాభదాయకంగా విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు ఉండేలా ఈ గ్రూపు సూచనలు చేయనుంది.


Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..

Also Read: ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్

For Telangana News And Telugu News..

Updated Date - Mar 04 , 2025 | 04:54 AM