ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అరవకుండా మత్తుమందు ఇచ్చి.. కొట్టి, గొంతు నులిమి..

ABN, Publish Date - Mar 05 , 2025 | 02:41 AM

శిరీషను ఆమె భర్త వినయ్‌కుమార్‌, ఆడపడచు కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. శిరీష కన్నా ముందు ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్న వినయ్‌ కుమార్‌..

శిరీషను.. ఆమె భర్త, ఆడపడుచే హత్య

చేసినట్టు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ?

ప్రేమించినట్లు నటించి శిరీషను

మూడో పెళ్లి చేసుకున్న వినయ్‌

మొదటి భార్యను కూడా ఇలాగే

చంపినట్లు విచారణలో వెల్లడి!

వేధింపులతో పారిపోయిన రెండో భార్య

చాదర్‌ఘాట్‌/హైదరాబాద్‌ సిటీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ పరిధిలో జరిగిన వివాహిత సింగం శిరీష మృతి కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శిరీషను ఆమె భర్త వినయ్‌కుమార్‌, ఆడపడచు కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. శిరీష కన్నా ముందు ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్న వినయ్‌ కుమార్‌.. మొదటి భార్యను ఇలాగే హత్య చేయగా, రెండో భార్య అతని వేఽధింపులు భరించలేక ఇల్లు వదిలి పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. శిరీషను కూడా వారు కొంతకాలంగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువుల అండదండులు లేని శిరీష వారి వేధింపులను చాలాకాలం మౌనంగా భరించింది. కానీ, ఇటీవల వేఽధింపులు మరీ ఎక్కువ కావడంతో భర్తతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి శిరీషకు ఆమె ఆడపడుచు సరితకు మధ్య గొడవ తలెత్తింది. ఇద్దరూ ఒకరిపై మరోకరు తీవ్రస్థాయిలో పరుష పదజాలాలతో దుర్భాషలాడుకున్నారు.


క్షణికావేశానికి గురైన ఆడపడుచు శిరీషను కొట్టింది. దీంతో శిరీష ఆమెపై ఎదురు తిరగడంతో భర్త వినయ్‌కుమార్‌ కూడా తన సోదరి సరితకు తోడుగా దాడికి దిగాడు. ఎలాగైనా శిరీష అడ్డు తొలగించుకోవాలని వినయ్‌, సరిత పథకం వేశారు. అతడు మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ కావడంతో.. శిరీషకు బలవంతంగా మత్తు ఇంజక్షన్‌ ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత గొంతు నులిమి, దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం ఏమీ తెలియనట్లు.. అన్న, చెల్లెలు ఇద్దరూ కలిసి శిరీషకు ఛాతీలో నొప్పి వచ్చిందని నాటకం ఆడుతూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. శిరీష మృతదేహాన్ని వెంటనే దహనం చేసేందుకు.. వినయ్‌, సరిత కలిసి అంబులెన్స్‌లో వారి స్వగ్రామానికి బయల్దేరు. కానీ, శిరీష మేనమామ మధుకర్‌ ఫిర్యాదుతో వారి పథకం పారలేదు. పోలీసులు వినయ్‌తో పాటు, అతని సోదరి సరితను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


తల్లిదండ్రులు లేరని తెలిసే..

శిరీషకు తల్లిదండ్రులు లేరని తెలుసుకున్న వినయ్‌కుమార్‌ ఒక పథకం ప్రకారమే ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించి పెళ్లి చేసుకున్నాడు. అతని నేర చరిత్ర గురించి తెలియని శిరీష .. ప్రేమ మైకంలో పడి, తనను పెంచుకున్న తల్లిదండ్రులను కాదనుకొని మరీ వినయ్‌ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. కానీ.. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే శిరీషను వినయ్‌ కుమార్‌, ఆడపడచు సరిత, ఇతర కుటుంబసభ్యులు వేధించడం ప్రారంభించారని.. చివరకు భర్త, అడపడచు కలిసి శిరీషను దారుణంగా హత్య చేశారని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్

Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ

Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు

Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..

Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2025 | 02:41 AM