Hyderabad: పటాన్‌చెరు @11 డిగ్రీలు
ABN, Publish Date - Jan 20 , 2025 | 04:02 AM
గ్రేటర్ హైదరాబాద్‌లో చలి తీవ్రత పెరిగింది. రాత్రిళ్లు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో పాటు చలిగాలుల తీవ్రత పెరగడంతో శివారు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్‌లో చలి తీవ్రత పెరిగింది. రాత్రిళ్లు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో పాటు చలిగాలుల తీవ్రత పెరగడంతో శివారు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. శనివారం పటాన్‌చెరులో అత్యల్పంగా 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది.
తెల్లవారుజామున ప్రధాన రహదారులను పొగమంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం మరో రెండు రోజుల పాటు ఇలాగే ఉంటుందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లిలో 11.3, మల్కాజిగిరిలో 12.1, రామచంద్రాపురంలో 12.2, రాజేంద్రనగర్‌లో 13, చార్మినార్‌లో 13.4, అల్వాల్‌లో 13.8 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Updated Date - Jan 20 , 2025 | 04:02 AM