Nizamabad: 10 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్, డీఈఈ
ABN, Publish Date - Mar 04 , 2025 | 03:48 AM
లంచం తీసుకుంటూ నిజామాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్-2 సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న చెన్నమాధవాని శ్రీరామరాజు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఈఈ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
కార్యాలయంలోనే పట్టుబడ్డ
నిజామాబాద్ సబ్‌రిజిస్ట్రార్ శ్రీరామరాజు
ఫైల్‌పై సంతకానికి 10 వేలు తీసుకుంటూ
దొరికిన జీహెచ్‌ఎంసీ డీఈఈ దశరథ్
ఖిల్లా(నిజామాబాద్), హైదరాబాద్ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : లంచం తీసుకుంటూ నిజామాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్-2 సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న చెన్నమాధవాని శ్రీరామరాజు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఈఈ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తాను కొనుగోలు చేసిన స్థలాన్ని తన పేరిట మార్చే విషయమై ఇటీవల సబ్‌రిజిస్ట్రార్ శ్రీరామరాజును కలిశాడు. అందుకుగాను తనకు రూ. 10 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో శ్రీరామరాజుకు రూ. 10వేల లంచం ఇస్తుండగా.. ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్.. శ్రీరామరాజుతో పాటు ఆయన వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న రంగ్‌సింగ్ వెంకటరావ్‌ను కూడా అరెస్టు చేశారు.
జీహెచ్‌ఎంసీ డివిజన్2 నాణ్యత నియంత్రణ విభాగంలో ఎ. దశరథ్ ముదిరాజ్ డిప్యూటీ ఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. బాధితుడి ఫైల్‌ను క్లియర్ చేసి పై అధికారులకు పంపాలంటే రూ. 20 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందులో రూ. 10 వేలు తీసుకున్నారు. మిగిలిన రూ. 10 వేలూ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాఽధితుడు ఏసీబీ అధికారులకు సమాచారమందించారు. బాఽధితుడి నుంచి మిగిలిన రూ.10 వేల లంచం సోమవారం తీసుకుంటుండగా కాపు కాసిన ఏసీబీ అధికారులు దశరథ్‌ను పట్టుకున్నారు.
Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..
Also Read: ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్
For Telangana News And Telugu News..
Updated Date - Mar 04 , 2025 | 03:48 AM