ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mastan sai: మస్తాన్ సాయి ఎలా ట్రాప్ చేస్తాడంటే.. ఏబీఎన్ చేతిలో రిమాండ్ రిపోర్ట్..

ABN, Publish Date - Feb 05 , 2025 | 12:47 PM

విజయవాడకు చెందిన లావణ్య అనే యువతి ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి సంబంధించిన హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకుని లోతుగా దర్యాఫ్తు చేస్తున్నారు. వీడియో కాల్ రికార్డింగ్‌లు, రికార్డ్ వీడియోలు ఆ హార్డ్ డిస్క్ ల్ ఉన్నాయి.

Mastan sai

యువతులను ట్రాప్ చేసి, నగ్న వీడియోలతో బెదిరించి, లైంగిక వాంఛలు తీర్చుకుంటూ ఎన్నో అక్రమాలకు పాల్పడిన మస్తాన్ సాయి (Mastan sai) అనే వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడకు చెందిన లావణ్య అనే యువతి ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి సంబంధించిన హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకుని లోతుగా దర్యాఫ్తు చేస్తున్నారు. వీడియో కాల్ రికార్డింగ్‌లు, రికార్డ్ వీడియోలు ఆ హార్డ్ డిస్క్ ల్ ఉన్నాయి. అతడికి సంబంధించిన ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి (Crime News). మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ ``ఏబీఎన్`` చేతికి చిక్కింది.


ప్రైవేట్ పార్టీలకు వెళ్లిన సమయంలో తన సెల్‌ఫోన్‌తో అక్కడ దృశ్యాలను రికార్డు చేసేవాడు. ఆ తర్వాత వారికి వాటిని చూపించి బెదిరింపులకు దిగేవాడు. మస్తాన్‌ సాయిపై ఫిర్యాదు చేసిన లావణ్యతో కూడా అలాగే చేశాడు. ఆమెతో వీడియో కాల్స్ మాట్లాడుతూ రికార్డ్ చేసేవాడు. అలా లావణ్యకు చెందిన 40 వీడియో కాల్స్‌ను రికార్డ్ చేశాడు. ఆ విషయం లావణ్యకు తెలియదు. అలాగే లావణ్య ఈ-మెయిల్ ఖాతాలన్నింటినీ హ్యాక్ చేశాడు. ఆ విషయాన్ని బాధితురాలు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. 2023లో మస్తాన్ సాయి సోదరి వివాహానికి హాజరయ్యేందుకు గుంటూరు వెళ్లిన లావణ్య బట్టలు మార్చుకున్న సమయంలో మస్తాన్ సాయి వీడియో రికార్డ్ చేశాడు (Mastan sai Remand).


ఆ వీడియోలను చూపించి లావణ్యను శారీరకంగా, లైంగికంగా వేధించాడు. మస్తాన్ సాయి వీడియోలు రికార్డ్ చేశాడని తన ప్రియుడు సినీ నటుడు రాజ్ తరుణ్‌కు కూబా లావణ్య తెలియజేసింది. కాగా, ఇలాంటి నేపథ్యంలోనే గతంలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌‌లో కూడా మస్తాన్ సాయి పైన కేసు నమోదు అయింది. లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు బిగ్‌బాస్ ఫేం శేఖర్ బాషా, మస్తాన్ సాయి కుట్ర కూడా పన్నినట్టు సమాచారం. దీనికి సంబంధించి వారిద్దరూ మొబైల్ ద్వారా మాట్లాడుకున్న మాటలకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను కూడా నార్సింగ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 05 , 2025 | 12:47 PM