ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IT Raids: ప్రముఖ ప్రొడ్యూసర్స్ నివాసాల్లో ఐటీ సోదాలు..

ABN, Publish Date - Jan 21 , 2025 | 07:54 AM

హైదరాబాద్‌లో పలుచోట్ల ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని 8 చోట్ల ఏక కాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

IT Rides

హైదరాబాద్‌: నగరంలో పలుచోట్ల ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు (IT Raids) చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాదు (Hyderabad)లో పలు చోట్ల సోదాలు చేస్తున్నారు. 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. తెలుగు చలనచిత్ర నిర్మాతల నివాసాలపై ఐటి శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Sirish) , దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి (Hansitha Reddy) నివాసాలపై ఐటి సోదాలు జరుగుతున్నాయి. కాగా సంక్రాంతికి భారీ బడ్జెట్‌తో గేమ్ చెంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్స్ తీసిన విషయం తెలిసిందే. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.


దిల్‌రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లల్లో కూడా ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో అనేకచోట్ల ఐటీ బృందాలు సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ నుంచి రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. గేమ్‌ ఛేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం.. సినిమాలను భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు నిర్మించారు. అలాగే బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌ చిత్రానికి‌ డిస్ట్రిబ్యూటర్‌గా దిల్‌రాజు వ్యవహరించారు. మరో వైపు మైత్రీ సంస్థ మీద కూడా ఐటి దాడులు జరుగుతున్నాయి. మైత్రీ నవీన్, సిఈవో చెర్రీ, ఇంకా సంస్థ సంబంధీకుల అందరి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారులు. మైత్రీ సంస్థ ఇటీవలే పుష్ప2తో భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా రూ.18 వందల కోట్లకు పైగా వసూల్ చేసినట్టు మేకర్స్ పోస్టర్స్ ద్వారా తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీ పోర్టు.. వాటాలు కేవీరావుకు తిరిగిచ్చేసిన అరబిందో..

ట్రంప్ తొలి షాక్!

ఆ ఆటో డ్రైవర్‪కు రివార్డు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 21 , 2025 | 09:11 AM