ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HMDA: రుసుము చెల్లిస్తే.. ఎల్‌ఆర్‌ఎస్‌ 10 రోజుల్లోనే!

ABN, Publish Date - Mar 04 , 2025 | 03:54 AM

క్రమబద్ధీకరణ రుసుముతోపాటు ప్రో-రేటా ఓపెన్‌ స్పేస్‌ చార్జీలను కలిపి ఈనెల 31వ తేదీలోగా చెల్లించిన వారికే 25 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రాయితీ కోరుతున్న అర్హులైన ప్లాట్‌ యజమానులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.

దరఖాస్తు తిరస్కరిస్తే 10 శాతం ప్రాసెసింగ్‌ ఫీజుగా మినహాయింపు

ప్రో-రేటా ఓపెన్‌ స్పేస్‌ రుసుము చెల్లించకుంటే రాయితీ లేనట్లే

ఆ రుసుము చెల్లించకపోయినా క్రమబద్ధీకరణకు ఆమోదం

కానీ, భవన నిర్మాణ సమయంలో మొత్తం సొమ్ము చెల్లించాల్సిందే

హైదరాబాద్‌ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఫీజు చెల్లించిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పది రోజుల్లోగా పరిష్కరిస్తామని హెచ్‌ఎండీఏ ప్రకటించింది. క్రమబద్ధీకరణ రుసుముతోపాటు ప్రో-రేటా ఓపెన్‌ స్పేస్‌ చార్జీలను కలిపి ఈనెల 31వ తేదీలోగా చెల్లించిన వారికే 25 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రాయితీ కోరుతున్న అర్హులైన ప్లాట్‌ యజమానులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ, వివిధ కారణాలతో దరఖాస్తు తిరస్కరణకు గురైతే.. ప్రాసెసింగ్‌ చార్జీల కింద 10 శాతం మినహాయించుకుని.. మిగిలిన 90 శాతాన్ని వెనక్కి ఇస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, నిషేధిత జాబితాలో లేని భూములు, చెరువులు, కుంటలు, నదులకు 200 మీటర్ల పరిధిలో లేని ప్లాట్ల దరఖాస్తులకు ఆటోమేటిక్‌గా ఫీజు సమాచారం వచ్చేస్తుంది. వీటి పరిధిలోని దరఖాస్తులను మాత్రం రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు పంపిస్తారు. వాటి నుంచి ఆమోదం వస్తే మాత్రమే ఫీజు చెల్లింపు వివరాలు రానున్నాయి. అలాగే, క్రమబద్ధీకరణ చార్జీతోపాటు ప్రొ-రేటా ఓపెన్‌ స్పేస్‌ చార్జీని కలిపి చెల్లించిన వారికే 25 శాతం రాయితీ వర్తించనుంది. ఓపెన్‌ స్పేస్‌ చార్జీ చెల్లించకుండా కూడా ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం క్రమబద్ధీకరణ ఫీజునే చెల్లించవచ్చు.


కానీ, అటువంటి వారికి రాయితీ వర్తించదు. దీనికితోడు, సంబంధిత ప్లాట్‌లో భవన నిర్మాణానికి వెళ్లిన సందర్భంలో ప్రొ-రేటా ఓపెన్‌ స్పేస్‌ చార్జీలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. రాయితీ వర్తించాలంటే రెండు చార్జీలను కలిపి ఇప్పుడు చెల్లించడమే ఉత్తమమని అధికారులంటున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ వివరాలు తెలుసుకునేందుకు ఇప్పటికే ఠీఠీఠీ.జూటట.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దరఖాస్తుదారులు ఇందులో దరఖాస్తు ఏ దశలో ఉంది? అనుమతి లభించిందా లేదా!? ఫీజు వివరాలు, ఏమైనా తక్కువ పడిందా? దరఖాస్తును తిరస్కరించారా? వంటి వివరాలను చూసుకునే అవకాశం కల్పించింది. ఎల్‌ఆర్‌ఎ్‌సపై సందేహాలను నివృత్తి చేసుకోవడానికి అమీర్‌పేట స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. ఫోన్‌ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవడానికి టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 599 8838ను హెచ్‌ఎండీఏలో అందుబాటులోకి తీసుకొచ్చారు.


Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..

Also Read: ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్

For Telangana News And Telugu News..

Updated Date - Mar 04 , 2025 | 03:54 AM