Sridhar Babu: ఖాళీ అయిన వెంటనే ఉద్యోగాల భర్తీ: దుద్దిళ్ల
ABN, Publish Date - Jan 05 , 2025 | 03:40 AM
ఖాళీ అయిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
హైదరాబాద్, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ఖాళీ అయిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని ‘టీజీ ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శనివారం జరిగిన 196 మంది అగ్నిమాపక శాఖ డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత పదేళ్లుగా నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కించింది.
భర్తీ ప్రక్రియలో ఏర్పడిన న్యాయపరమైన ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ నియామక పత్రాలను అందజేస్తున్నాం. ఈ అంశంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. హోంశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంపై సీఎం రేవంత్ ప్రత్యేకంగా దృష్టి సారించారు’’ అని పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలు అభినందనీయమని, ముఖ్యంగా ఖమ్మంలో వరదలు తలెత్తినప్పుడు వీరు కీలకంగా వ్యవహరించారని కొనియాడారు.
Updated Date - Jan 05 , 2025 | 03:40 AM