ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

1.83 లక్షల కోట్ల పెట్టుబడులు

ABN, Publish Date - Mar 10 , 2025 | 03:59 AM

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో ప్రధానంగా పారిశ్రామిక రంగంలో ఎక్కువగా పెట్టుబడులు సమకూరాయని తెలిపాయి.

  • పలు కంపెనీలతో సర్కారు ఎంవోయూలు

  • 15 నెలల్లో సాధించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో ప్రధానంగా పారిశ్రామిక రంగంలో ఎక్కువగా పెట్టుబడులు సమకూరాయని తెలిపాయి. ఈ 15 నెలల కాలంలో రూ.1.83 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయని పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ అధికార పీఠం చేపట్టిన నాటి నుంచి సాధించిన పెట్టుబడులను సర్కారు వర్గాలు వెల్లడించాయి. 2023 డిసెంబరులో రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వచ్చింది. పాలనా పగ్గాలు చేపట్టిన నెల రోజుల్లోనే సీఎం రేవంత్‌ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు నేతృత్వంలో స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. ఆ సమావేశంలో దాదాపు రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది. ఆ కంపెనీల్లో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్‌ కూడా ఉంది. ఆ తర్వాతా రాష్ట్రానికి పెట్టుబడు లు కొనసాగాయి. ముఖ్యంగా పరిశ్రమలకు కావాల్సిన అనుమతులన్నీ సాఽధ్యమైనంత త్వరగా ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభు త్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంది. గతంలో పరిశ్రమల శాఖకు వచ్చిన దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండేవి. కాంగ్రెస్‌ అధికారంలోకి వ చ్చిన తర్వాత ఈఅంశంపై ప్రధానంగా దృష్టి పెట్టింది.


పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించి.. అర్హత, సామ ర్థ్యం కలిగిన కంపెనీలకు గరిష్ఠంగా 30రోజుల్లో అనుమతులివ్వడం మొదలుపెట్టింది. దీంతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందు కు ఆసక్తి చూపారు. ఈ పెట్టుబడుల్లో ప్రధానంగా రెన్యువబు ల్‌ ఎనర్జీ రంగంలో అదానీ గ్రూప్‌తో పాటు ప్రముఖ దిగ్గజ కంపెనీలు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నాయి. 2024 డిసెంబరులో రాష్ట్ర ప్రభుత్వం రెన్యువబుల్‌ ఎనర్జీ పాలసీని తీసుకువచ్చింది. ఆ తర్వాత ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్‌ పాలసీ ని కూడా ప్రకటించింది. ఇది పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఉండటంతో పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. జాతీ య, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఈ రంగంలో ఇప్పటికే భారీగా పెట్టుబడులు ప్రకటించాయి. ఈ ఏడాది జనవరిలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం రెండోసారి దావో్‌సకు వెళ్లింది. అక్కడ రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. కాగా, ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రత్యక్షంగా 70వేలు, పరోక్షంగా 1.50లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.

తేదీ కంపెనీ పెట్టుబడి (రూ.కోట్లలో) రంగం ఉద్యోగాలు

17జనవరి 2024 గోడీ ప్రైవేటు లిమిటెడ్‌ రూ.8,000 ఎనర్జీ స్టోరేజ్‌ 6000

22 జనవరి 2024 సన్‌ పెట్రో కెమికల్స్‌ రూ.45,500 రెన్యువబుల్‌ ఎనర్జీ 7000

22 జనవరి 2024 మెగా ఇంజనీరింగ్‌ రూ.15,000 రెన్యువబుల్‌ ఎనర్జీ 7250

22 జనవరి 2024 జేఎ్‌సడబ్ల్యూ లిమిటెడ్‌ రూ.800 ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ 200

23 జనవరి 2024 అమెజాన్‌ వెబ్‌సర్వీస్‌ రూ.60,000 ఐటీ, డేటా సెంటర్స్‌ 49550

23 జనవరి 2024 టిల్‌మ్యాన్‌ రూ.15,000 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 49000

గ్లోబల్‌ హోల్డింగ్స్‌

జనవరి 2025 సీటీఆర్‌ఎల్‌ఎ్‌స- రూ.10,000 ఐటీ, డేటా సెంటర్స్‌ 3600

డేటాసెంటర్స్‌

జనవరి 2025 స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రూ.500 ఏరోస్పేస్‌ -----

8 డిసెంబరు 2024 లెన్స్‌కార్ట్‌ రూ.1500 తయారీ రంగం 2100

8డిసెంబరు 2024 ప్రీమియర్‌ ఎనర్జీస్‌ రూ.4300 రెన్యువబుల్‌ ఎనర్జీ 4300

8 డిసెంబరు 2024 ఆజాద్‌ ఇంజనీరింగ్‌ రూ.800 ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ 600

4 మార్చి 2025 సింగరేణి కాలరీస్‌ రూ.22,000 థర్మల్‌ ఎనర్జీ -----


ఇవి కూడా చదవండి

BRS:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు పరిశీలన..

TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

AICC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా అంటే..

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 10 , 2025 | 03:59 AM