ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhadrachalam: భద్రాద్రి రామయ్య సమగ్ర సేవలపై ప్రత్యేక యాప్‌

ABN, Publish Date - Feb 14 , 2025 | 04:29 AM

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కల్పించే సదుపాయాలు, సౌకర్యాలు, సేవలు సమగ్రంగా భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు దేవస్థానం అధికారులు మొబైల్‌యాప్‌ను రూపొందిస్తున్నారు.

  • అన్ని రకాల సేవలు, వివరాలు ఒకే చోట

భద్రాచలం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కల్పించే సదుపాయాలు, సౌకర్యాలు, సేవలు సమగ్రంగా భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు దేవస్థానం అధికారులు మొబైల్‌యాప్‌ను రూపొందిస్తున్నారు. ఆత్రేయ ఇన్పోటెక్‌ సంస్థ సాంకేతిక సహకారంతో ఈ యాప్‌ను అధికారులు రూపొందిస్తున్నారు. దీని ద్వారా దేవస్థానం సమగ్ర సమాచారం భక్తుల అరచేతిలోని మొబైల్‌లో నిక్షిప్తమై ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.


ఈ ప్రత్యేక యాప్‌లో భద్రాద్రి రామాలయ ప్రాశస్త్యం, అనుబంధ ఆలయాలు, వాటి విశిష్టత, రూట్‌మ్యాప్‌ ఉంటాయి. అలాగే ఆలయంలో జరిగే ఆర్జిత సేవల వివరాలు, దర్శన వేళలు, వసతి సౌకర్యాలు, ఇతర సమాచారం పొందుపరుస్తారు. అలాగే దేవస్థాన వెబ్‌సైట్‌ లింక్‌ను ఈ యాప్‌లో జోడిస్తారు. మరో నెల రోజుల్లో యాప్‌ సిద్ధం కానుంది.

Updated Date - Feb 14 , 2025 | 04:29 AM