ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ట్రాయ్ రూ.20 రూల్.. మీ సిమ్ వాడకపోయినా డీయాక్టివేట్ కాకుండా ఉండాలంటే..

ABN, Publish Date - Jan 26 , 2025 | 06:34 PM

మీరు మీ సిమ్ కార్డును ఎక్కువగా వినియోగించరా. కార్డు డీయాక్టివేట్ కాకుండా ఉండేందుకు అత్యంత సులువైన మార్గం ఇదే..

ఇంటర్నెట్ డెస్క్: ఫోన్ కాల్స్, మెసేజీలు, కనీసం డాటా కోసమైనా సిమ్ కార్డును సుదీర్ఘకాలం పాటు వినియోగించకుండా ఉంటే కార్డు డీయాక్టివేట్ అయిపోతుందన్న విషయం తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల క్రితం అమల్లోకి తెచ్చిన ఈ నిబంధనపై తాజాగా ట్రాయ్ క్లారిటీ ఇచ్చింది. సిమ్‌ను వాకపోయిన అందులో కనీస మొత్తం కొంత ఉంటే ఎప్పటికీ డీయాక్టివేట్ కాదని తాజాగా స్పష్టం చేసింది. ట్రాయ్ వివరణ ప్రకారం, వినియోగదారులు తమ సిమ్ బ్యాలెన్స్‌లో కనీసం రూ.20 ఉండేలా జాగ్రత్త పడితే సిమ్ డీయాక్టివేట్ కాదు. ఇప్పటివరకూ వినియోగదారులు ఈ బెడద నుంచి తప్పించుకునేందుకు కనీస మొత్తం కింద రూ.199 పెట్టి నెలనెలా రీచార్చ్ చేసుకునే వారు. తాజా ప్రకటనతో వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చినట్టైంది.

Charger: మీ వైట్ ఛార్జర్ నల్లగా మారిందా.. ఇలా చేస్తే 2 సెకన్లలో కొత్త దానిలా ప్రకాశిస్తుంది.


ఈ రూల్ ఏంటంటే..

ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం, సిమ్ కార్డును అస్సలు వాడకపోతే 90 రోజుల తరువాత డీయాక్టివేట్ అయిపోతుంది.

కానీ, 90 రోజుల తరువాత సిమ్ బ్యాలెన్స్ కనీసం రూ.20 ఉండేలా జాగ్రత్త పడితే సిమ్ డీయాక్టివేట్ కాదు. ఇందుకు బదులుగా ఆ రూ.20 బ్యాలెన్స్ నుంచి డెబిట్ అవుతాయి. ఆ తరువాత మరో 30 రోజుల పాటు సిమ్ యాక్టివ్‌గా ఉంటుంది.

ఈలోపు మళ్లీ బ్యాలెన్స్ కింద రూ.20తో రీచార్జ్ చేసుకుంటే మరో నెల పాటు సిమ్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇలా ఎంతకాలమైనా డీయాక్టివేషన్‌ను వాయిదా వేసుకోవచ్చు.

Digital Detox: 'డిజిటల్ డిటాక్స్'.. ఇది మనస్సు, శరీరాన్ని ప్రభావితం చేస్తుందా..


అయితే, ఏ సమయంలో అయినా సిమ్ బ్యాలెన్స్ రూ.20లోపు పడితే మాత్రం డీయాక్టివేషన్ తప్పదనన్న విషయాన్ని గుర్తించాలి.

ఇక డీయాక్టివేట్ అయిన నెంబర్‌ను 15 రోజుల లోపు రూ.20తో రీచార్జ్ చేయించుకుని మళ్లీ యాక్టివేట్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. అయితే, ఈ స్కీమ్ కేవలం ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ నిబంధనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తమ రెండో సిమ్‌ను ఎక్కువగా వినియోగించని వారికి ఇది ఎంతో ఊరటనిచ్చే అంశమన్న వ్యా్ఖ్యలు వినిపిస్తున్నాయి.

Smart Lock System: దొంగలను పట్టించిన స్మార్ట్ లాక్ సిస్టమ్.. ఎలాగంటే..

Read Latest and Tech News

Updated Date - Jan 26 , 2025 | 06:35 PM