Charger: మీ వైట్ ఛార్జర్ నల్లగా మారిందా.. ఇలా చేస్తే 2 సెకన్లలో కొత్త దానిలా ప్రకాశిస్తుంది.
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:37 PM
ఫోన్ ఛార్జర్ కేబుల్స్ సాధారణంగా కొన్ని తెల్లగా ఉంటాయి. కానీ, వాటిని ఎక్కువగా వాడటం వల్ల కొంతకాలానికి వైట్ ఛార్జర్ కేబుల్స్ మరకలతో నల్లగా మారిపోతాయి. అయితే, ఈ చిట్కాలతో వాటిని క్లీన్ చేసుకోని కొత్త దానిలా చేసుకోండి..

Charger Cable: నేటి కాలంలో మనిషి ఏమీ లేకున్నా బ్రతకగలడు కానీ ఫోన్ లేకుంటే మాత్రం బ్రతకడం కష్టంగా మారింది. ఫోన్ నిరతరం పనిచేయాలంటే దానికి ఛార్జర్ ముఖ్యం. ఛార్జర్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి వైట్, ఇంకోటి బ్లాక్. వైట్ ఛార్జర్ కొత్తగా తీసుకున్నప్పుడు బాగుంటుంది కానీ ఎక్కువ కాలం వాడే కొద్ది అది మరకలతో నల్లగా మారిపోతుంది. ఇది కేబుల్స్ పనితీరును కూడా తగ్గిస్తుంది. అయితే, అలాంటి ఛార్జర్లను కడగడం సాధ్యం కాదు. కానీ.. ఛార్జర్, దాని కేబుల్ 2 సెకన్లలో కొత్త దానిలా ప్రకాశించాలంటే ఈ టిప్స్ పాటించండి..
ఇలా ఛార్జర్, ఛార్జర్ కేబుల్‌ను శుభ్రపరచుకోండి..
ఛార్జర్, ఛార్జర్ కేబుల్‌ను శుభ్రపరచడం సాంకేతికంగా తేలికగా అనిపించవచ్చు.. కానీ, జాగ్రత్త తీసుకోవాలి.. ఎందుకంటే ప్రతికూల ప్రభావితం ఉంటుంది.
ముందుగా మెత్తటి కాటన్ లేదా మైక్రోఫైబర్ క్లాత్ తీసుకోండి. కొద్దిగా తడిగా ఉన్న గుడ్డతో కేబుల్‌పై ఉన్న మురికిని తుడవండి. తుడిచేటప్పుడు కేబుల్‌ను ఎక్కువగా సాగదీయకుండా జాగ్రత్త వహించండి.
ఛార్జర్ కేబుల్ చాలా మురికిగా ఉంటే, కొంచెం తేలికపాటి ద్రవ సబ్బును నీటితో కలపండి. మెత్తని గుడ్డను దానిలో నానబెట్టి కేబుల్‌ను తుడవండి. సబ్బు నీరు మురికి ధూళిని సులభంగా తొలగిస్తుంది. అయితే, శుభ్రపరిచిన తర్వాత, పూర్తిగా ఆరిపోయే వరకు కేబుల్ ఉపయోగించవద్దు.
తెలుపు వస్తువులు చాలా త్వరగా మురికిగా మారడానికి ఫోన్ ఛార్జర్లు మినహాయింపు కాదు. వైట్ ఫోన్, పవర్ బ్యాంక్, ఇయర్‌ఫోన్, మొబైల్ ఛార్జర్, ఛార్జర్ కెబుల్ క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. దీని కోసం, వెనిగర్ లేదా బేకింగ్ సోడా ఉపయోగించి పేస్ట్ చేయండి. ఒక కప్పులో మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్, నీరు కలపండి. ఈ పేస్ట్‌లో గుడ్డను నానబెట్టి పిండాలి. ఆ గుడ్డతో ఛార్జర్, ఛార్జర్ కెబుల్‌ని శుభ్రం చేయండి.
నల్లబడిన ఛార్జర్ దాని కేబుల్ తెల్లగా మెరిసేలా చేయడానికి మీరు పురుషుల షేవింగ్ క్రీమ్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఛార్జింగ్ కేబుల్‌కు షేవింగ్ క్రీమ్‌ను రాయండి. దీని తరువాత, ఛార్జింగ్ కేబుల్‌ను శుభ్రమైన గుడ్డతో తుడవండి. తీగ కొత్తదిలా మెరుస్తుంది.
ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ రసం తీసుకుని దానికి 1 టీస్పూన్ బేకింగ్ సోడా కలపండి. నిమ్మరసం, బేకింగ్ సోడా కలిపి పేస్ట్ లా చేసి, శుభ్రమైన గుడ్డ లేదా స్పాంజ్ సహాయంతో ఈ పేస్ట్‌ను ఛార్జర్, ఛార్జర్ కెబుల్ పై అప్లై చేయండి. ఆ తర్వాత పేస్ట్‌ను ఛార్జర్‌పై 5 నిమిషాలు ఉంచండి. తర్వాత వెచ్చని నీటితో తడి గుడ్డతో ఛార్జర్‌ను తుడవండి.
ఛార్జర్ కేబుల్స్, ఛార్జర్‌లను క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచాలి, ఎందుకంటే పరికరం దీర్ఘాయువుకు మాత్రమే కాకుండా భద్రతకు కూడా శుభ్రత ముఖ్యం. పై పద్ధతులను అనుసరించడం ద్వారా, మీరు మీ ఛార్జర్ కేబుల్‌లను సులభంగా శుభ్రంగా, కొత్త వాటిలాగా పని చేసేలా ఉంచుకోవచ్చు. అలాగే జాగ్రత్తగా ఉపయోగిస్తే ఛార్జర్‌లు, కేబుల్‌లు కూడా ఎక్కువసేపు ఉంటాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)