ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yuzvendra Chahal: గొడవ తర్వాత డైమండ్స్.. భార్య గురించి గతంలో షాకింగ్ విషయం చెప్పిన చాహల్..

ABN, Publish Date - Feb 25 , 2025 | 06:08 PM

చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య కొంత కాలం క్రితం విభేదాలు తలెత్తాయి. సోషల్ మీడియాలో ఒకర్నొకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరిద్దరూ విడిపోనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ వారిద్దరూ కోర్టు మెట్లెక్కారు.

Yuzvendra Chahal, Dhanashree Verma

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) తన భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma) నుంచి విడాకులు తీసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఎక్కువ కాలం కలిసి జీవించలేకపోయారు. చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య కొంత కాలం క్రితం విభేదాలు తలెత్తాయి. సోషల్ మీడియాలో ఒకర్నొకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరిద్దరూ విడిపోనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ వారిద్దరూ కోర్టు మెట్లెక్కారు. ముంబై బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టు చాహల్‌, ధనశ్రీకి విడాకులు మంజూరు చేసింది (Yuzvendra Chahal and Dhanashree Verma Divorce).


చాహల్, ధనశ్రీ విడాకుల నేపథ్యంలో వీరికి సంబంధించిన పాత సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ధనశ్రీ ఝలక్ దిక్లాజా కార్యక్రమంలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ సమయంలో ధనశ్రీకి మద్దతుగా చాహల్ ఆ కార్యక్రమానికి విచ్చేశాడు. ఆ ప్రోగ్రామ్‌లో భాగంగా చాహల్, ధనశ్రీ ఓ ఫన్ గేమ్ ఆడారు. పదాలను గెస్ చేయాల్సిన ఆ గేమ్‌లో చాహల్ కొన్ని హింట్స్ ఇచ్చాడు. డైమండ్స్ (Diamonds) పదం గురించి చెప్పే క్రమంలో.. మనం గొడవ పడినప్పుడు నువ్వు ఎక్కువగా డిమాండ్ చేసేవి ఏంటి అని అడిగాడు. అయినా ధనశ్రీ గెస్ చేయలేకపోయింది.


చివరకు ప్లేకార్డ్ మీద రాసి ఉన్న డైమండ్స్ పదాన్ని చూసి.. నేను నిన్ను ఎప్పుడు వజ్రాలు అడిగాను అని ప్రశ్నించింది. దానికి చాహల్ స్పందిస్తూ.. ఆమె చెవి రింగులను చూపించాడు. దాంతో అక్కడున్న హోస్ట్‌లతో పాటు అందరూ నవ్వుకున్నారు. విడాకుల నేపథ్యంలో చాహల్ నుంచి ధనశ్రీ రూ.60 కోట్లు భరణంగా పొందిందని వార్తలు వస్తున్నాయి. ఆ డబ్బులతోనే ధనశ్రీ ఓ బెంజ్ కారు కూడా కొనుగోలు చేసిందని బాలీవుడ్ మీడియా పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో గతంలో డైమండ్స్ మేటర్ తాజాగా మళ్లీ బయటకు వచ్చింది.

ఇవి కూడా చదవండి..

Pak media on TeamIndia victory: భారత్ విజయంపై పాక్ మీడియా వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..


Team India Champions Trophy 2025: టీమిండియాకు ఇంత మేలు చేస్తారా? ఐసీసీపై పలువురు క్రికెటర్ల ఆగ్రహం..


Ind vs Pak: పక్కకెళ్లి ఆడుకోమ్మా.. అబ్రార్‌పై ట్రోలింగ్.. పాకిస్తాన్ ఓటమిపై ట్రెండ్ అవుతున్న మీమ్స్..


మరిన్ని క్రీడా వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 25 , 2025 | 06:08 PM