South Africa Victory : అఫ్ఘాన్‌ను శతక్కొట్టి..
ABN, Publish Date - Feb 22 , 2025 | 03:55 AM
శుక్రవారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో సఫారీలు 107 పరుగుల తేడాతో గెలిచి టోర్నీని ఘనంగా ఆరంభించారు.
రికెల్టన్ సెంచరీ
107 రన్స్ తేడాతో సౌతాఫ్రికా ఘనవిజయం
కరాచీ: చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు కదం తొక్కారు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (103) కెరీర్‌లో తొలి శతకం సాధించగా, కెప్టెన్ బవుమా (58), వాన్‌డర్ డుస్సెన్ (52), మార్‌క్రమ్ (52 నాటౌట్) అర్ధసెంచరీలతో చెలరేగారు. దీంతో శుక్రవారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో సఫారీలు 107 పరుగుల తేడాతో గెలిచి టోర్నీని ఘనంగా ఆరంభించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 315 పరుగులు చేసింది. నబీ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో అఫ్ఘాన్ ఏ దశలోనూ విజయంవైపు సాగలేదు. రహ్మత్ షా (90) ఒంటరి పోరాటం చేయగా, సహచరుల్లో ఒక్కరూ కనీసం 20 రన్స్ చేయలేకపోయారు. ఫలితంగా అఫ్ఘాన్ 43.3 ఓవర్లలో 208 రన్స్‌కు కుప్పకూలింది. రబాడకు మూడు.. ఎన్‌గిడి, ముల్డర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా రికెల్టన్ నిలిచాడు.
కలిసికట్టుగా: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టాప్-6 బ్యాటర్లలో నలుగురు 50+ స్కోర్లు సాధించడం విశేషం. ఓపెనర్ జోర్జి (11) విఫలమయ్యాడు. మరో ఓపెనర్ రికెల్టన్ మాత్రం అఫ్ఘాన్ బౌలర్లను ఆరంభం నుంచి దీటుగా ఎదుర్కొన్నాడు. భారీషాట్లకు వెళ్లకపోయినా బంతులను వృధా చేయకుండా స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. కెప్టెన్ బవుమాతో కలిసి రెండో వికెట్‌కు 129 పరుగులు జత చేశాడు. హాఫ్ సెంచరీ అయ్యాక బవుమాను నబీ అవుట్ చేశాడు. ఆ తర్వాత డుస్సెన్ రాకతో స్కోరులో వేగం పెరిగింది. అటు శతకం పూర్తయ్యాక రికెల్టన్ రనౌట్ కావడంతో మూడో వికెట్‌కు ఈ ఇద్దరి మధ్య 44 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత డుస్సెన్ కూడా అర్ధసెంచరీ పూర్తి చేసుకుని 43వ ఓవర్‌లో వెనుదిరిగాడు. కానీ చివర్లో మార్‌క్రమ్ బాదుడుకు సఫారీల స్కోరు అవలీలగా 300 దాటేసింది.
స్కోరుబోర్డు
దక్షిణాఫ్రికా: రికెల్టన్ (రనౌట్) 103; జోర్జి (సి) అజ్మతుల్లా (బి) నబీ 11; బవుమా (సి) అటల్ (బి) నబీ 58; వాన్‌డర్ డుస్సెన్ (సి) షాహిదీ (బి) నూర్ అహ్మద్ 52; మార్‌క్రమ్ (నాటౌట్) 52; మిల్లర్ (సి) రహ్మత్ (బి) ఫరూఖి 14; జాన్సెన్ (బి) అజ్మతుల్లా 0; ముల్డర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 50 ఓవర్లలో 315/6. వికెట్ల పతనం: 1-28, 2-157, 3-201, 4-248, 5-298, 6-299. బౌలింగ్: ఫరూఖి 8-0-59-1; అజ్మతుల్లా 6-0-39-1; నబీ 10-0-51-2; రషీద్ ఖాన్ 10-0-59-0; గుల్బదిన్ 7-0-42-0; నూర్ అహ్మద్ 9-0-65-1.
అఫ్ఘానిస్థాన్: గుర్బాజ్ (సి) కేశవ్ (బి) ఎన్‌గిడి 10; జద్రాన్ (బి) రబాడ 17; అటల్ (రనౌట్) 16; రహ్మత్ షా (సి) రికెల్టన్ (బి) రబాడ 90; షాహిదీ (సి) బవుమా (బి) ముల్డర్ 0; ఒమర్జాయ్ (సి) రికెల్టన్ (బి) రబాడ 18; నబీ (సి) రబాడ (బి) జాన్సెన్ 8; గుల్బదీన్ (సి) బవుమా (బి) ఎన్‌గిడి 13; రషీద్ (సి) మార్‌క్రమ్ (బి) కేశవ్ 18; నూర్ అహ్మద్ (బి) ముల్డర్ 9; ఫరూఖి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 43.3 ఓవర్లలో 208 ఆలౌట్. వికెట్ల పతనం: 1-16, 2-38, 3-50, 4-50, 5-89, 6-120, 7-142, 8-169, 9-208, 10-208. బౌలింగ్: జాన్సెన్ 8-1-32-1; ఎన్‌గిడి 8-0-56-2; రబాడ 8.3-1-36-3; ముల్డర్ 9-0-36-2; కేశవ్ 10-0-46-1.
Updated Date - Feb 22 , 2025 | 03:55 AM