ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాక్‌ చిత్తుగా..

ABN, Publish Date - Feb 20 , 2025 | 03:32 AM

చాంపియన్స్‌ ట్రోఫీని న్యూజిలాండ్‌ ఘనంగా ఆరంభించింది. బుధవారం జరిగినప్రారంభ మ్యాచ్‌లో కివీస్‌ 60 పరుగులతో డిఫెండింగ్‌ చాంప్‌ పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో...

శతక్కొట్టిన లాథమ్‌, యంగ్‌

న్యూజిలాండ్‌ బోణీ ఘనం

చాంపియన్స్‌ ట్రోఫీ

కరాచీ: చాంపియన్స్‌ ట్రోఫీని న్యూజిలాండ్‌ ఘనంగా ఆరంభించింది. బుధవారం జరిగినప్రారంభ మ్యాచ్‌లో కివీస్‌ 60 పరుగులతో డిఫెండింగ్‌ చాంప్‌ పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 320/5 స్కోరు చేసింది. లాథమ్‌ (118 నాటౌట్‌), యంగ్‌ (107) సెంచరీలతో చెలరేగగా.. ఫిలిప్స్‌ (61) మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. నసీమ్‌ షా, హారిస్‌ రౌఫ్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఛేదనలో పాకిస్థాన్‌ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. ఖుష్‌దిల్‌ షా (69), బాబర్‌ ఆజమ్‌ (64) అర్ధ శతకాలు సాధించారు. సల్మాన్‌ ఆఘా (42) పర్లేదనిపించాడు. ఒరౌర్క్‌, శాంట్నర్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. లాథమ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.


రెండు సెంచరీ భాగస్వామ్యాలు: టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఓ దశలో 40/2, ఆపై 17 ఓవర్లో 73/3తో నిలిచింది. కానీ యంగ్‌, లాథమ్‌ శతకాలతోపాటు, ఫిలిప్స్‌ దూకుడైన ఇన్నింగ్స్‌తో 300కు పైగా స్కోరు చేసింది. ఎనిమిదో ఓవర్లోనే అబ్రార్‌ అహ్మద్‌ క్యారమ్‌ బాల్‌తో కాన్వే (10)ను బౌల్డ్‌ చేశాడు. విలియమ్సన్‌ (1)ను నసీమ్‌ షా క్యాచవుట్‌ చేశాడు. మిచెల్‌ (10)ను రౌఫ్‌ అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌ కోల్పోయిన కివీస్‌ ఇబ్బందుల్లో పడింది. అయితే..యంగ్‌, లాథమ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 118 రన్స్‌ జోడించాడు. శతకం సాధించిన కాసేపటికే యంగ్‌ను నసీమ్‌ పెవిలియన్‌ చేర్చాడు. అనంతరం లాథమ్‌, ఫిలిప్స్‌ బౌలర్లను ఆడేసుకున్నారు. ఐదో వికెట్‌కు లాథమ్‌, ఫిలిప్స్‌ 74 బంతుల్లోనే 125 రన్స్‌ జోడించడం విశేషం. ఫిలిప్స్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో నిష్క్రమించాడు. అంతకుముందు చాంపియన్స్‌ ట్రోఫీ టోర్నీని పాకిస్థాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ జర్దారీ ప్రారంభించారు.

సంక్షిప్తస్కోర్లు: న్యూజిలాండ్‌: 50 ఓవర్లలో 320/5 (లాథమ్‌ 118 నాటౌట్‌, యంగ్‌ 107, ఫిలిప్స్‌ 61, నసీమ్‌ షా 2/63, రౌఫ్‌ 2/83);

పాకిస్థాన్‌: 47.2 ఓవర్లలో 260 ఆలౌట్‌ (ఖుష్‌దిల్‌ షా 69, బాబర్‌ 64, సల్మాన్‌ ఆఘా 42, ఒరౌర్క్‌ 3/47, శాంట్నర్‌ 3/66, హెన్రీ 2/25).



ఇవీ చదవండి:

గిల్‌కు అండగా రోహిత్.. గట్టిగా ఇచ్చిపడేశాడుగా

అయ్యో పాపం.. 17 ఏళ్ల వెయిట్ లిఫ్టర్.. 270 కిలోలు ఎత్తబోయి..

కింద కివీస్ ఆటగాళ్లు.. మీదుగా విమానాలు.. స్టేడియంలో అంతా షాక్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2025 | 03:32 AM