Rohit Sharma: గిల్‌కు అండగా రోహిత్.. గట్టిగా ఇచ్చిపడేశాడుగా
ABN , Publish Date - Feb 19 , 2025 | 07:33 PM
Champions Trophy 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏదైనా ప్లేయర్‌ను నమ్మాడంటే అతడి కోసం నిలబడతాడు. ఇది మరోమారు ప్రూవ్ అయింది. వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు అతడు గ్రేట్ సపోర్ట్ అందించాడు.
చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత సారథి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుబ్‌మన్ గిల్‌కు ఊరికే వైస్ కెప్టెన్సీ ఇవ్వలేదంటూ సీరియస్ అయ్యాడు. టీమ్ బాగు కోసమే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని విమర్శకులకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. గిల్ ప్రతిభ ఏంటో తమకు తెలుసునని అన్నాడు. చాన్నాళ్లుగా అతడు నిలకడగా ఆడుతున్నాడని మెచ్చుకున్నాడు హిట్‌మ్యాన్. అతడో క్లాస్ ప్లేయర్ అని.. అతడి నంబర్స్ అదుర్స్ అని ప్రశంసల్లో ముంచెత్తాడు. అతడి ఆటతీరు, నిలకడ, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు చూసే ప్రమోషన్ ఇచ్చామని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చాడు రోహిత్.
ఐదురుగు స్పిన్నర్లపై క్లారిటీ!
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఐదుగురు స్పిన్నర్లతో ఆడుతున్న సంగతి తెలిసిందే. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌ను స్క్వాడ్‌లోకి తీసుకుంది టీమిండియా. స్పిన్‌కు అంతగా అనుకూలించని దుబాయ్ పిచ్‌లపై ఇంత మంది స్పిన్నర్లు ఎందుకనే విమర్శలు వస్తున్నాయి. దీంతో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన తాజా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ అంశం మీదా రోహిత్ స్పష్టత ఇచ్చాడు. వాళ్లంతా స్పిన్నర్లు కాదని కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ‘ఆ ఐదుగురూ స్పిన్నర్లు కాదు. వాళ్లను స్పిన్నర్లలా మేం చూడట్లేదు. అందులో ఇద్దరు మాత్రమే (కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి) మాత్రమే ప్రధాన స్పిన్నర్లు. మిగతా ముగ్గురూ ఆల్‌రౌండర్లు. వాళ్ల వల్ల టీమ్ డెప్త్ మరింత పెరిగింది’ అని రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీ టీమిండియాకు ఎంతో కీలకమని చెప్పుకొచ్చాడు హిట్‌మ్యాన్.
ఇవీ చదవండి:
అయ్యో పాపం.. 17 ఏళ్ల వెయిట్ లిఫ్టర్.. 270 కిలోలు ఎత్తబోయి..
కింద కివీస్ ఆటగాళ్లు.. మీదుగా విమానాలు.. స్టేడియంలో అంతా షాక్
అందరి నోటా ఒకటే మాట.. ఆ టీమ్‌దే కప్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి