ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ind vs Pak: టీమిండియా టార్గెట్ 242.. పాకిస్తాన్ 241 ఆలౌట్!

ABN, Publish Date - Feb 23 , 2025 | 06:34 PM

దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. పిచ్ స్లోగా ఉండడం, భారత బౌలర్లు నియంత్రణతో బౌలింగ్ చేయడంతో పాక్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు.

India vs Pakistan

దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పిచ్ స్లోగా ఉండడం, భారత బౌలర్లు నియంత్రణతో బౌలింగ్ చేయడంతో పాక్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. పాక్ ఓపెనర్లు బాబర్ అజామ్ (23), ఇమామ్ ఉల్ హక్ (10) త్వరగానే ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రిజ్వాన్ (77 బంతుల్లో 46), షకీల్ (76 బంతుల్లో 62) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేశారు.


వేగంగా ఆడే క్రమంలో రిజ్వాన్, షకీల్ వెంట వెంటనే అవుటయ్యారు. భారత ఫీల్డర్లు క్యాచ్‌లను జారవిడవడం కూడా వీరికి కలిసి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఖుష్‌దిల్ పరిస్థితులకు తగినట్టు ఆడాడు. చివర్లో బౌండరీల మోత మోగించాడు. రెండు సిక్స్‌లతో 38 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. (Champions Trophy).


భారత బౌలర్లందరూ చాలా నియంత్రణగా బౌలింగ్ చేశారు. స్లో పిచ్‌పై తన స్పిన్ బౌలింగ్‌తో చెలరేగిన కుల్‌దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు దక్కించుకున్నారు. హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అక్షర్ పటేల్ అద్భుత ఫీల్డింగ్ చేసి ఇద్దరిని రనౌట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే 242 పరుగులు చేయాలి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2025 | 06:45 PM