ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yuzvendra Chahal Dating: క్రికెటర్ ఛాహల్‌తో డేటింగ్.. ఆర్‌జే మహవాస్‌తో రియాక్షన్ ఏంటంటే..

ABN, Publish Date - Mar 10 , 2025 | 04:27 PM

భార్య ధనశ్రీ వర్మకు విడాకులు ఇచ్చిన ఛాహల్.. ఆర్‌జే మహవాస్‌‌తో డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. నిన్నటి నుంచి ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఆర్‌జే మహవాస్‌ ఈ వార్తలపై స్పందించింది. ఛాహల్‌తో డేటింగ్ వార్తలపై స్పందించింది.

Yuzvendra Chahal with RJ Mahvash

ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. దీంతో అభిమానుల సంబరాలు మిన్నంటాయి. ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికర అంశం కూడా చాలా మందిని ఆకట్టుకుంది. స్పిన్నర్ యజువేంద్ర ఛాహల్ ఓ అమ్మాయితో కలిసి మ్యాచ్ చూసేందుకు దుబాయ్ స్టేడియంకు వెళ్లాడు. ఆ అమ్మాయి ఆర్‌జే మహవాస్‌ (RJ Mahvash). మ్యాచ్ ఆసాంతం వారిద్దరూ కలిసి వీక్షించారు (Yuzvendra Chahal Dating).


భార్య ధనశ్రీ వర్మకు విడాకులు ఇచ్చిన ఛాహల్.. ఆర్‌జే మహవాస్‌‌తో డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. నిన్నటి నుంచి ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఆర్‌జే మహవాస్‌ ఈ వార్తలపై స్పందించింది. ఛాహల్‌తో డేటింగ్ వార్తలను ఖండించింది. *ఇంటర్నెట్‌లో కొన్ని వార్తలు, ఊహాగానాలను చూస్తుంటే చాలా ఫన్నీగా అనిపిస్తోంది. ఇలాంటి రూమర్స్‌ను చూస్తుంటే నవ్వు వస్తోంది. ఒక అబ్బాయితో కలిసి కూర్చుంటే అతడితో డేటింగ్ చేస్తున్నట్టేనా. సారీ, మనం ఏ సంవత్సరంలో ఉన్నాం. కూర్చుని మాట్లాడిన అందరితోనూ డేటింగ్ అంటే మీరు ఎంతో మందితో డేటింగ్‌లో ఉన్నారు* అని ఆర్‌జే మహవాస్‌ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించింది.


కొద్ది సేపటికి ఈ ట్వీట్‌ను ఆర్‌జే మహవాస్‌ డిలీట్ చేసేసింది. కాగా, ఈ డేటింగ్ వార్తలపై యజువేంద్ర ఛాహల్ ఇంకా స్పందించలేదు. 2020లో ధన శ్రీ వర్మ మెడలో తాళి కట్టాడు. నాలుగేళ్ల తర్వాత వారిద్దరూ విడిపోయారు. భరణంగా భార్యకు ఛాహల్ రూ.60 కోట్లు ఇచ్చాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలని ధనశ్రీ వర్మ కుటుంబ సభ్యులు ఖండించారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 10 , 2025 | 04:27 PM