Champions Trophy: టీమిండియాకు బిగ్ షాక్.. ఫైనల్‌కు ముందు భారత స్టార్ ప్లేయర్‌కు గాయం..
ABN, Publish Date - Mar 08 , 2025 | 05:07 PM
భారత్, న్యూజిలాండ్ జట్లు హోరాహోరీ పోరుకు సిద్దమవుతున్నాయి. మెగా ఫైనల్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే కీలక ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ గాయపడినట్టు తెలుస్తోంది.
ఎంతో రసవత్తరంగా సాగి, క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) చివరి అంకానికి చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు సమయం దగ్గర పడుతోంది. భారత్, న్యూజిలాండ్ జట్లు హోరాహోరీ పోరుకు సిద్దమవుతున్నాయి. మెగా ఫైనల్ (Champions Trophy Final) కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే కీలక ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి గాయం అయినట్టు వార్తలు వస్తున్నాయి.
ఫైనల్‌కు ముందు జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్‌కు కోహ్లీ దూరమయ్యాడని, అతను గాయంతో ఇబ్బంది పడుతున్నాడని ఓ వార్తా సంస్థ పేర్కొంది. ప్రాక్టీస్ సెషన్‌లో పేసర్ బౌలర్‌ను ఎదుర్కొంటున్న టైమ్‌లో విరాట్ కోహ్లీకి గాయమైందని తెలుస్తోంది. బౌలర్ వేసిన బంతి నేరుగా మోకాలికి తగలడంతో కోహ్లీ మైదానాన్ని వీడినట్టు సమాచారం. గాయం అయిన చోట ఫిజియో చేత ప్రాథమిక చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. గాయం తగిలిన చోట పెయిన్ కిల్లర్ స్ప్రే చేసి, బ్యాండేజ్ చుట్టారని, ఆ వెంటనే కోహ్లీ విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిపోయాడని సమాచారం (Virat Kohli Injury).
కీలక ఫైనల్ మ్యాచ్‌కు ముందు కోహ్లీ గాయపడ్డాడన్న వార్త రావడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అయితే కోహ్లీకి అయిన గాయం అంత తీవ్రమైనది కాదని తెలుస్తోంది. గాయం తీవ్రత తక్కువేనని ఫైనల్ మ్యాచ్‌కు కోహ్లీ సిద్ధంగా ఉంటాడని మేనేజ్‌మెంట్ ధీమాగా ఉంది. ఈ టోర్నీలో టీమిండియాకు కోహ్లీ ఎంత కీలకంగా మారాడో తెలిసిందే. ముఖ్యంగా ఛేజింగ్‌లో కోహ్లీ కీలకంగా వ్యవహరిస్తూ జట్టును విజయతీరాలకు చేర్చుతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 08 , 2025 | 05:24 PM